Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం మరి కొద్ది గంటల్లోనే ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది. రేపు శుక్రవారం ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2400 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. కేవలం ఓవర్సీస్‌లో 2000 ప్రివ్యూలు వేస్తున్నారు. మూడు రోజుల్లో ఓవర్సీస్‌లో 10వేల షోలు వేయాలన్నది ప్లాన్. ఇంత భారీ ప్రణాళికల నడుమ దర్శకనిర్మాతలు మీడియా ఇంటరాక్షన్స్, ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు.
స్వయంగా మహేష్ రంగంలోకి దిగి ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. తొలిసారిగా మహేష్ బాబు ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతుండడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటిదాకా లవర్ బాయ్ ఇమేజ్ లోను, మాస్ హీరో గాను కనిపించిన మహేష్ రాజకీయ నాయకుడిగా ఎలా నటించాడు, ముఖ్యమంత్రిగా ఎలా అలరించాడు అనే విషయాలని తెర మీద చూసేందుకు వారు సన్నద్దం అవుతున్నారు.
తాజాగా కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ ముఖ్యమంత్రి పాత్ర గురించి ఆసక్తి కరమైన విషయాన్ని వెల్లడించాడు. మహేష్ బాబు మొదటి 15 నిమిషాల వరకే సాధారణంగా కనిపిస్తాడని ఆతరువాత సీఎం ఐపోతాడని అన్నారు. ఇక సినిమా చివరి వరకు మహేష్ ముఖ్యమంత్రిగానే కనిపిస్తాడని కొరటాల ఉత్కంఠ పెంచేశారు. మిగతా విషయాలు మీరు వీడియోలో చూడచ్చు