సూపర్ స్టార్ మహేష్‌బాబు 25వ చిత్రం ఫస్ట్‌లుక్ మరియు టీజర్ వచ్చేసింది. హీరోగా ఇన్ని సంవత్సరాలుగా నటిస్తున్నా కూడా ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా గడ్డం మరియు మీసాలతో కనిపించింది లేదు. ఇన్నాళ్లకు మహేష్‌బాబు గడ్డంతో ఎలా ఉంటాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎదురు చూపులకు తగ్గట్లుగానే మహేష్‌బాబు లుక్ ఉంది. మహర్షి టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మహేష్‌బాబు లుక్ మరియు స్టైల్ అదిరిపోయింది. ఫస్ట్‌లుక్‌తో మెస్మరైజ్ చేసిన చిత్ర యూనిట్ సభ్యులు టీజర్ విడుదలతో అమ్మాయిలు మరియు మహేష్‌బాబు ఫ్యాన్స్ గిలగిల కొట్టుకునేలా చేశారు.
టీజర్‌కు అనూహ్య స్పందన దక్కింది. మహేష్‌బాబు కేవలం తన లుక్ మరియు నడక, స్టైల్‌నే టీజర్‌లో చూపించాడు. అయినా కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఫ్యాన్స్ ఫిదా అవ్వడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కాని అమ్మాయిలు సోషల్ మీడియాలో మహేష్‌బాబుకు పడిపోతున్నారు. 40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల కుర్రాడిగా మహేష్‌బాబు కనిపించడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. మహర్షిగా మహేష్‌ను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు అంటూ అమ్మాయిు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్‌లుక్‌తో సినిమా స్థాయిని అమాంతం పెంచేశారు. 25వ సినిమా అంటే ఈమాత్రం ఉండాల్సిందే అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూడటం మొదలు అయ్యింది. వచ్చే ఏడాది సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.