మేడ మీద అబ్బాయి… తెలుగు బులెట్ రివ్యూ

meda meeda abbayi Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   అల్లరి నరేష్ , నిఖిల విమల్ , అవసరాల శ్రీనివాస్, హైపర్ ఆది , సత్యం రాజేష్ 
నిర్మాత :     బొప్పన చంద్రశేఖర్
దర్శకత్వం :    ప్రజీత్
మ్యూజిక్ డైరెక్టర్ :  షాన్ రెహమాన్ 
ఎడిటర్ :     నందమూరి హరి 
సినిమాటోగ్రఫీ : కుంజుని ఎస్. కుమార్  

కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వద్ద సరైన విజయం కోసం ఎదురు చూపులు చూస్తున్న అల్లరి నరేష్ హీరోగా వచ్చిన తాజా సినిమా “మేడ మీద అబ్బాయి”. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ” ఓరు వాడక్కన్ సెల్ఫీ” రీమేక్ గా వస్తున్న ఈ సినిమా మీద నరేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగినట్టు “మేడ మీద అబ్బాయి ” వుందో,లేదో చూద్దాం.

కథ…

శ్రీను( అల్లరి నరేష్ ) అల్లరి చిల్లరగా తిరిగే ఇంజనీరింగ్ స్టూడెంట్. దీంతో అతనికి ఇంజనీరింగ్ లో 24 సబ్జక్ట్స్ మిగిలిపోతాయి. శ్రీను కి తగ్గట్టే అతని స్నేహితులు ఇద్దరు ( హైపర్ adi , సత్యం రాజేష్ ) వుంటారు . పనీపాటా లేకుండా తిరిగే ఈ బ్యాచ్ కి ఎక్కడా గౌరవం దక్కదు. అనుకున్న కోరికలు తీరవు. దీంతో శ్రీను దృష్టి సినిమా రంగం మీద పడుతుంది. తాను పెద్ద డైరెక్టర్ కావాలని అందుకు షార్ట్ ఫిలిమ్స్ ని మార్గంగా ఎంచుకుంటాడు. అవి చూసి రాజమౌళి పిలిచి ఛాన్స్ ఇస్తాడని అయ్యగారి నమ్మకం. ఆ నమ్మకం తోటే ఇంట్లో చెప్పాపెట్టకుండా బయటికి వెళతాడు. ఆ వెళ్లే క్రమంలో కొత్తగా పొరుగింటిన దిగిన అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. ఆమెతో ఓ సెల్ఫీ దిగుతాడు. దీంతో శ్రీను లైఫ్ ఊహించని మలుపు తిరుగుతుంది. చివరకు శ్రీను ఏమయ్యాడు అన్నదే ఈ చిత్ర కథ.

విశ్లేషణ…

ఇన్నాళ్లు కామెడీ ఉంటే చాలు అనుకున్న అల్లరి నరేష్ ఈసారి కామెడీ, థ్రిల్లర్, సోషల్ మెసేజ్ వున్న కథని ఎంచుకున్నాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయాలు, సరదా సరదా సన్నివేశాలతో అలా గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఊహించని పరిణామాలు మొత్తం కథని మార్చిన విధానం , దాని ద్వారా పుట్టిన వినోదం, ఓ కాంటెంపరరీ సామాజిక అంశం…సోషల్ మీడియా ప్రభావం వంటివి ప్రేక్షకులతో భలేగా కనెక్ట్ అవుతాయి. అల్లరి నరేష్, సత్యం రాజేష్, హైపర్ ఆది, అవసరాల శ్రీనివాస్ పాత్రల ద్వారా వినోదానికి లోటు ఉండదు. ఇక ఈ వినోదానికి ఫుల్ స్టాప్ పెడుతూ వచ్చే ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఆలోచనల్లో పడేస్తాయి. కంక్లూజన్ కూడా చాలా బాగుంది. చాన్నాళ్ల తర్వాత అల్లరి నరేష్ కి సూపర్ హిట్ దక్కినట్టే.

ప్లస్ పాయింట్స్ …

అల్లరి నరేష్
హైపర్ ఆది
సత్యం రాజేష్
కథ, కధనం, సందేశం
కామెడీ .

మైనస్ పాయింట్స్ …

అక్కడక్కడా రొటీన్ సన్నివేశాలు

తెలుగు బులెట్ పంచ్ లైన్…“మేడ మీద అబ్బాయి” పేరు రొటీన్ కానీ సినిమా స్పెషల్ .
తెలుగు బులెట్ రేటింగ్… 3 / 5 .

మరిన్ని వార్తలు:

యుద్ధం శరణం… తెలుగు బులెట్ రివ్యూ

కుశ టీజర్‌ వచ్చేసింది …ఎన్టీఆర్ అదుర్స్

బాలయ్య న్యూస్ మెటీరియల్