Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సుకుమార్ ఒక విభిన్నమైన శైలిలో సినిమాలు తీస్తాడు. రెగ్యులర్ ఫార్మట్‌లో కాకుండా హాలీవుడ్ రేంజ్ స్క్రీన్‌ప్లేతో సినిమాలు తీస్తాడు అనే టాక్ ఉంది. ఆయన సినిమాలు అర్థం చేసుకోవలంటే కాస్త తెలివి ఉండాలి. అంతటి గుర్తింపు ఉన్న దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారాడు. మొదటి సినిమా ‘కుమారి 21ఎఫ్’ అంటూ నిర్మించాడు. ఆ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. సక్సెస్ అనేది ఎప్పుడు రాదు, ఆ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అందుకే సుకుమార్ నిర్మించిన రెండవ చిత్రం ‘దర్శకుడు’ ఫ్లాప్ అయ్యింది.
సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ‘రంగస్థలం’ అనే విభిన్న తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ‘దర్శకుడు’ చిత్రం కోసం సుకుమార్ గత నెల రోజులుగా తీవ్రంగా కష్టపడి ప్రయమోషన్ చేస్తున్నాడు. తీరా సినిమా చూస్తే ఫలితం లేకుండా పోయింది. సుకుమార్ నిర్మాతగా ‘దర్శకుడు’ సినిమా ఫ్లాప్ అయిన కారణంగా ఆ ప్రభావం ‘రంగస్థలం’పై పడే అవకాశం ఉంది. ఆయన ఒత్తిడిని ఎదుర్కోవడంతో రంగస్థలం చిత్రాన్ని సరిగా తీయలేక పోవచ్చు అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. సినీ వర్గాల వారు మరియు విమర్శకులు కూడా సుకుమార్ నిర్మాణంను వదులుకోవాలని సలహా ఇస్తున్నారు. నిర్మాతగా కొనసాగితే దర్శకుడిగా క్రేజ్ తగ్గడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
మరిన్ని వార్తలు: