Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్ని సంవత్సరాల క్రితం చిన్న చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అని, ప్రేమ కథా చిత్రాలకు గురువు అంటూ తేజను పిలుస్తూ ఉండేవారు. పలు చిన్న చిత్రాలను తెరకెక్కించి పెద్ద సక్సెస్‌లు చేసుకున్న దర్శకుడు తేజ దాదాపు పది సంవత్సరాలు సక్సెస్‌లు లేకుండా కెరీర్‌ను కొనసాగిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు రానాతో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పెట్టిన పెట్టుబడికి ఏకంగా మూడు రెట్ల లాభాలు వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తేజకు మళ్లీ గుడ్ టైం స్టార్ అయ్యిందని భావిస్తున్నారు. అందుకే తేజ దర్శకత్వంలో నటించేందుకు యువ హీరోలు ఆసక్తిగా ఉన్నారు.
‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం సక్సెస్ తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని తన తర్వాత సినిమాను మెగా హీరో వరుణ్ తేజ్‌తో తెరకెక్కించేందుకు తేజ సన్నద్దం అవుతున్నాడు. ఇటీవలే ‘ఫిదా’ చిత్రంతో ప్రేక్షకులను ఫిదా చేసి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ మరో సక్సెస్ కోసం తేజకు డేట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీని సినిమాగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 కోట్ల లోపు బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. వచ్చే సంవత్సరం ఆరంభంలో ఈ సినిమాను పట్టాలెక్కిస్తామని దర్శకుడు తేజ చెబుతున్నాడు. నవంబర్ లేదా డిసెంబర్లో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్లడి చేసే అవకాశాలున్నాయి.
మరిన్ని వార్తలు: