లిటిల్ పవర్ స్టార్ అకిరా నందన్ పుట్టినరోజు ఇవాళ.ఈ సందర్భంగా మెగాస్టార్ ట్వీట్ చేశారు. తమ్ముడు పవన్ కుమారుడు అకిరాను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేశారు. ‘మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6’4″) అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి’ విష్ యూ ఏ పవర్ ఫుల్ ప్యూచర్. హ్యాపీ బర్త్ డే అకిరా అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరాకు చిరు విషెస్ తెలపడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అటు పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అడ్డంకులు లేవు. దీంతో బాస్ సూపర్ అంటూ మెగా ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతున్నారు.
ఇవాళ అకిరా బర్త్ డే సందర్భంగా అటు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అకీరాకు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల మొదటి సంతానం అయిన అకిరా నందన్. పవన్ కల్యాణ్ తర్వాత వారసుడు ఎవరు అంటే అకిరా నందన్ అని చెబుతుంటారు ఆయన ఫ్యాన్స్. ఇక అకిరా కూడా తనకు వీలు దొరికినప్పుడల్లా తండ్రి దగ్గరకు వస్తుంటాడు. అటు పెదనాన్న చిరంజీవి ఫ్యామిలీతో కూడ అకీరా కలిసే ఉంటాడు. పండగలు, పబ్బాలకు అకిరా మెగాస్టార్ ఇంటికి వెళ్తాడు. ప్రస్తుతం అకిరా వయసు 16 ఏళ్లు. ఇప్పటికే మళయాళంలో అకిరా ఓ సినిమాలో కూడా నటించాడు.
మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6'4") అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి.Wish you a "Power"ful future. Happy Birthday Akira! #8thApril pic.twitter.com/wDO7qSwxHx
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020