MLA మూవీ రివ్యూ… తెలుగు బులెట్

MLA Movie Review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   కళ్యాణ్ రామ్, కాజల్ , బ్రహ్మానందం 
నిర్మాతలు :    కిరణ్ రెడ్డి , భరత్ చౌదరి , TG విశ్వప్రసాద్   
దర్శకత్వం :     ఉపేంద్ర మాధవ్ 
సినిమాటోగ్రఫీ:   ప్రసాద్ మురెళ్ళ 
ఎడిటర్ :    బిక్కిన తమ్మిరాజు 
మ్యూజిక్ :    మణిశర్మ 

సొంత సినిమాలకే ఎక్కువగా పరిమితం అవుతూ వస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ బయట నిర్మాతలతో చాన్నాళ్ల తర్వాత చేసిన సినిమా ఎమ్మెల్యే. ఇక సురేందర్ రెడ్డి , అనిల్ రావిపూడి వంటి కమర్షియల్ దర్శకుల్ని తెలుగు తెరకి పరిచయం చేసిన జడ్జిమెంట్ కూడా కళ్యాణ్ రామ్ దే. ఇప్పుడు ఉపేంద్ర మాధవ్ వంటి కొత్త దర్శకుడికి కళ్యాణ్ ఈ సినిమాతో అవకాశం ఇచ్చాడు. దీంతో ఎమ్మెల్యే సినిమా మీద అంచనాలు పెరిగాయి. సినిమా అందుకు తగ్గట్టు ఉందోలేదో చూద్దాం.

కథ…

ఇంట్లో పెద్దలకు తెలియకుండా చెల్లి( లాస్య) కి తాను కోరుకున్న వాడితో పెళ్లి జరిపిస్తాడు హీరో ( కళ్యాణ్ రామ్). కోపం వచ్చిన తండ్రి ( నాగినీడు ) పిల్లలిద్దరినీ ఇంటి నుంచి బయటకు పంపేస్తాడు. ఆలా చెల్లి , బావతో పాటు బెంగుళూరు చేరుకున్న హీరో అక్కడ కాజల్ ని చూసి ప్రేమలో పడతాడు. ఇంతలో సొంత బావ పనిచేస్తున్న కంపెనీలోనే కళ్యాణ్ రామ్ కి కూడా ఉద్యోగం వస్తుంది. ఆ కంపెనీ వ్యవహారాలు చూసే ( పోసాని ) కి అమ్మాయిల పిచ్చి. అక్కడ కళ్యాణ్ పని చేస్తుండగానే కాజల్ కంపెనీ ఓనర్ కూతురుగా అక్కడికి వస్తుంది. కంపెనీకి వచ్చిన ఓ ఇబ్బందిని గట్టెక్కించి ఆమె ప్రేమ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ కి ఆమె అసలు తమ యజమాని కూతురే కాదని తెలుస్తుంది. ఆమె ప్రేమని పొందాలంటే అనంతపురం జిల్లాలో వీరభద్రాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలవాల్సిన సవాల్ కళ్యాణ్ కి ఎదురు అవుతుంది. అక్కడ ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గాడప్ప తో కళ్యాణ్ ఎలా తలపడ్డాడు . చివరకు ఎవరు గెలిచారు అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ …

సరికొత్త ఆలోచనలు , కథలతో వస్తున్న యంగ్ దర్శకులు విజయాలు సాధిస్తున్నతరుణంలో వచ్చిన మరో కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్. ఎమ్మెల్యే కథతో ఆయన కళ్యాణ్ రామ్ ని ఒప్పించడం ఒక ఎత్తు అయితే దాన్ని తెరకు ఎక్కించడం ఇంకో ఎత్తు. రొటీన్ కధకి హీరో ఎస్ చెప్పాడంటే కధనంలో దర్శకుడు ఏదో చేస్తాడన్న నమ్మకమే. పటాస్ లాంటి సామాన్యమైన కధని వినోదాత్మకంగా అనిల్ రావిపూడి మలిచినట్టుగానే ఎమ్మెల్యే కధనం వుండాలని ఉపేంద్ర , కళ్యాణ్ రామ్ అనుకుని వుంటారు. అయితే అనుకోవడం వేరు దాన్ని అమలు చేయడం వేరు. కధలో వినోదం ఇమిడ్చి కమర్షియల్ సినిమాగా మార్చే ఛాన్సెస్ చాలా ఉన్నప్పటికీ కధనం కోసం రాసుకున్న సీన్స్ కూడా రొటీన్ కావడంతో అనుకున్న ఎఫెక్ట్ రాలేదు. కథ సోల్ మిస్ కాకుండా కధనం వుండాల్సింది పోయి , సీన్స్ అన్ని సబ్ ప్లాట్స్ చుట్టూ తిరగడంతో వ్యవహారం గాడి తప్పింది. ఇక చేసిన సీన్స్ లోకొత్తదనం లేకపోవడం , వినోదం అనుకున్న సీన్స్ పండకపోవడంతో తెర మీద జరిగేది ఏదీ ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది.

కధనం బోల్తాపడ్డప్పటికీ కళ్యాణ్ రామ్ నటనలో బాగా ఈజ్ పెరిగింది. డైలాగ్ డెలివరీ , డాన్స్ లు కూడా బాగా చేసాడు. ఇక హీరోయిన్ కాజల్ , బ్రహ్మానందం, పృద్వీ, విలన్ రవికిషన్ బాగా చేసినప్పటికీ కథ , కధనం రొటీన్ గా తయారు కావడంతో ఉపయోగం లేకుండా పోయింది.ఇక సాంకేతిక నిపుణుల పనితీరు బాగుంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు మణిశర్మ చాన్నాలా తరువాత తన మార్క్ చూపించాడు ఈ సినిమాతో. కెమెరా , ఆర్ట్ వర్క్ , నిర్మాణ విలువలు కూడా సూపర్.

ప్లస్ పాయింట్స్ .

కళ్యాణ్ రామ్
కాజల్, బ్రహ్మానందం నటన.
మణిశర్మ మ్యూజిక్

మైనస్ పాయింట్స్

రొటీన్ కథ , కధనం.

తెలుగు బులెట్ పంచ్ లైన్… ఈ ”ఎమ్మెల్యే “ ని ఎన్నోసార్లు చూసాం అనిపించింది.
తెలుగు బులెట్ రేటింగ్… 2.5 /5 .