Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్రంలో ఎన్డీఏ సర్కారు వచ్చిన తొలిరోజుల్లోనే తెలంగాణ టీడీపీకి పదవి ఇవ్వాలని చంద్రబాబు చెప్పారు. కానీ అప్పట్నుంచి రకరకాల కారణాలు చెప్పి మోడీ దాటేస్తూ వచ్చారు. కనీసం చిన్న రాష్ట్రానికైనా గవర్నర్ పోస్టు ఇవ్వకుండా మిత్రుల్ని అవమానించారు. ఇలాంంటి సమయంలో వెంకయ్య మళ్లీ మోత్కుపల్లిని కదిలించారు. త్వరలో శుభవార్త వింటారని ఊరించారు.
ఈసారైనా పదవి వస్తుందా… లేదా అని మోత్కుపల్లి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చాలా రాష్ట్రాలకు పూర్తిస్థాయి గవర్నర్లు లేదు. మన తెలుగు రాష్ట్రాలకూ పూర్తిస్థాయి గవర్నర్లు లేరు. రెండు రాష్ట్రాలకు విడివిడిగా గవర్నర్లను నియమించాల్సి ఉంది, కానీ కేంద్రం మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. కానీ ఈ నెలల ఏడు రాష్ట్రాల గవర్నర్ల పదవులు భర్తీ అవుతాయని, అప్పుడు ఛాన్స్ ఉంటుందని మోత్కుపల్లికి చెప్పారట.
మోత్కుపల్లికి పదవికి ఇవ్వకపోతే దాన్ని కూడా ఎలక్షన్ ఇష్యూ చేయాలని చంద్రబాబు రెడీగా ఉన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ లాంటి విషయాల్లో హ్యాండ్ ఇచ్చిన మోడీ ఇంత చిన్న పని కూడా చేయకపోతే ఇక మిత్రులుగా ఉండి ఏం లాభమని చాలా మంది టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. మోడీ తమని కావాలనే అనుమానిస్తున్నారని, బాబు సమయం చూసి బుద్ధి చెబుతారని ధీమాగా ఉన్నారు.
మరిన్ని వార్తలు: