కుర్చీ ప్లాన్ వేసిన ముద్రగడ

mudragada-padmanabham-planing-to-kapu-movement-in-is-house

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఒకటి కాదు, రెండు కాదు ఇరవై మూడు రోజుల నుంచి ముద్రగడ పాదయాత్రకు బయల్దేరడం, గేటు దగ్గరే పోలీసులు అడ్డుకుని లోపలకు పంపించడం కామనైపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే కాపులకు కూడా నీరసం వస్తుందని గ్రహించిన ముద్రగడ ప్లాన్ బీని అమలు చేశారు. గేటు దగ్గరే పోలీసులు అడ్డుకుంటున్నారు కాబట్టి అక్కడే కుర్చీ వేసుకుని బైఠాయించారు.

ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పోలీసులు, ప్రభుత్వం స్పందించడం లేదని, ఇక తనకు ఓపిక నశించిందన్నారు ముద్రగడ. అందుకే ఇంటి ముందే కుర్చీ వేసుకుని ధర్నా కొనసాగిస్తానని, ఏ క్షణంలో అయినా పోలీసుల వలయాన్ని దాటుకుని ముందుకెళ్తానని చెప్పారు. దీంతో ముద్రగడ నివాసానికి కాపులు భారీగా తరలివస్తున్నారు. ముద్రగడ ప్లాన్ మార్చారు కాబట్టి మనమూ ప్లాన్ మారుద్దామని పోలీసులు చర్చించుకుంటున్నారు.

ముద్రగడ కుర్చీ ప్లాన్ సంగతి ప్రభుత్వానికి చేరవేశారు పోలీసులు. దీంతో సీఎం చంద్రబాబు కీలక మంత్రులతో సమావేశమై దీటైన వ్యూహరచన రెడీ చేస్తున్నారు. కిర్లంపూడి వస్తున్న కాపుల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేయాలని అనధికారిక ఆదేశాలు వెళ్లాయి. మళ్లీ అరెస్టుల పర్వం మొదలుపెడితే కానీ కాపుల దూకుడు తగ్గదని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వార్తలు:

ఇవేం మాటలు తొగాడియా