Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. తాను వారంలో రెండు రోజులు ఏడుస్తున్నట్టు చెప్పారు. తన భార్య, కొడుకు, కోడలు కి జరిగిన అవమానం గుర్తొస్తే ఇప్పటికీ బాధ కలుగుతోందని ముద్రగడ అన్నారు. అసలెందుకు బతికి ఉన్నానా అనిపిస్తోందన్నారు. అయితే తమని అవమానించిన వారికి శిక్ష పడేదాకా బతికి ఉంటానని చెప్పారు.
కాపు రిజర్వేషన్ ఉద్యమం విషయంలో వెనకడుగు వేసేది లేదని ముద్రగడ తాజాగా స్పష్టం చేశారు. ముందు ప్రకటించినట్టు ఈ నెల 26 నుంచి అమరావతి పాదయాత్ర యధాతధంగా నిర్వహిస్తానని ముద్రగడ వివరించారు. ఇప్పటికే తన ఇంటి ముందు పోలీసుల్ని మోహరించారని చెప్పారు. ఈసారి జైల్లో పెట్టినా సరే పాదయాత్ర కొనసాగించి తీరుతానని తెలిపారు. సీఎం చంద్రబాబు ఒకప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేసినప్పుడు ఏ ఫార్మటు లో అనుమతి తీసుకున్నారో చెబితే ఇప్పుడు కూడా అదే పద్ధతిలో తాను అనుమతి కోరతానని ముద్రగడ వివరించారు. చంద్రబాబు పాలన చూసి సిగ్గుపడతున్నట్టు ముద్రగడ ప్రకటించారు. తన జాతి కోసం జరుగుతున్న పోరాటాన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తుని విధ్వంసంలో కేసులకు సంబంధించి 330 మందిని ముద్దాయిలుగా చేశారని ముద్రగడ చెప్పారు.
మరిన్ని వార్తలు