చైతూ, సమంత పెళ్లిలో ఇది హైలైట్‌

naga chaitanya And samantha wedding highlights

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహం గోవాలోని రిసార్ట్స్‌లో చాలా వైభవంగా జరిగింది. నిన్న హిందూ సాంప్రదాయం ప్రకారం, అచ్చ తెలుగు పద్దతిలో వివాహాన్ని జరిపించారు. వివాహ వేడుక సమయంలో అక్కినేని మరియు దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. సంగీత్‌ కార్యక్రమం నిన్న ఉదయం జరిగింది. ఆ కార్యక్రమంలో నాగచైతన్య, సమంతలతో కలిసి నాగార్జున, అఖిల్‌, వెంకటేష్‌, సురేష్‌బాబు, రానా, సుమంత, సుశాంత్‌ ఇంకా పలువురు కూడా తెగ డాన్స్‌లు వేశారు. ముఖ్యంగా నాగర్జున, వెంకటేష్‌లు నాగచైతన్యతో కలిసి వేసిన స్టెప్పులు హైలైట్‌ అంటు వివాహ వేడుకలో పాల్గొన్న వారు చెబుతున్నారు.

నాగచైతన్యకు మేనమామలు అయిన సురేష్‌బాబు, వెంకటేష్‌లు చేసిన సందడి అంతా ఇంత కాదని, ఇప్పటి వరకు వారిద్దరిని చూడని విధంగా వివాహ వేడుకలో చూశామని కొందరు అంటున్నారు. చాలా వైభవంగా సంగీత్‌ కార్యక్రమం జరిగింది. ఒకానొక సందర్బంలో సురేష్‌బాబు, సమంతలు కలిసి వేసిన స్టెప్పులు అందరిని ఆకట్టుకున్నాయి. సురేష్‌బాబు స్టెప్పులకు సమంత కూడా అవాక్కయింది. అక్కినేని మరియు దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు తమ కుటుంబంలోకి సమంతను ఆహ్వానిస్తూ ఒక వీడియోను తయారు చేశారు. ఆ వీడియోలో కుటుంబ సభ్యులు దాదాపు అంతా కూడా కనిపించారట. ఏయన్నార్‌ మరియు రామానాయుడు కూడా ఆ వీడియోలో కనిపించారట. ఆ వీడియో చూసి సమంత చాలా సంతోషించిందని, రెండు ఫ్యామిలీలు ఇచ్చిన ఆ గిఫ్ట్‌ను సమంత ఎప్పటికి గుర్తుంచుకునేలా ఉందని పెళ్లికి హాజరు అయిన అతిథులు కూడా అన్నారు.