చైతూ సైడ్‌ అవ్వడంతో శౌర్యకు పండగే…!

Naga Shaurya's Narthanasala Release In August 30

నాగచైతన్య, అను ఎమాన్యూల్‌ జంటగా తెరకెక్కిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుందని భావిస్తున్న నేపథ్యంలో షాకింగ్‌గా సినిమాను వాయిదా వేయడం జరిగింది. కేరళలో వరదలు భారీగా ఉన్న కారణంగా రీ రికార్డింగ్‌ పనులు పూర్తి కాలేదు. దాంతో శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని వాయిదా వేసినట్లుగా సమాచారం అందుతుంది. శైలజ రెడ్డి అల్లుడు చివరి నిమిషంలో బరి నుండి తప్పుకున్న కారణంగా ఈనెల 30న విడుదల కాబోతున్న నర్తనశాల చిత్రంకు బంపర్‌ ఆఫర్‌ తలిగినట్లయ్యింది. పోటీ లేని సమయంలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఖచ్చితంగా భారీ వసూళ్లను నమోదు చేయడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.

narthana-sala

నాగశౌర్య గత చిత్రం ‘ఛలో’తో మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా మంచి విజయాన్ని దక్కించుకుంటుందని చెబుతున్నారు. ఛలో చిత్రాన్ని నిర్మించిన నాగశౌర్య తల్లి ఉషా ఈ చిత్రాన్ని కూడా నిర్మించడం జరిగింది. కొడుకుపై ప్రేమతో ఆమె భారీ బడ్జెట్‌ను ఖర్చు చేయడంతో పాటు, భారీ మొత్తం ఖర్చు చేసి మరీ చిత్రానికి పబ్లిసిటీ చేస్తుంది. దాంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సమయంలో శైలజ రెడ్డి అల్లుడు తప్పుకోవడంతో సోలో రిలీజ్‌ కాబోతుంది. ఆ కారణంగా నర్తనశాల పంట పండినట్లే అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే నాగశౌర్య ఈజీగా 25 కోట్లను తన ఖాతాలో వేసుకోవచ్చు. మరి నాగశౌర్య నర్తనశాలతో సక్సెస్‌ అవుతాడో లేదో చూడాలి.

nagashourya