యంగ్ హీరో నాగశౌర్య మూవీ లకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో అందరికీ తెలిసిందే. ఆయన మూవీ లకు ప్రేక్షకులు మంచి రెస్పాన్స్‌ని అందిస్తుంటారు. అయితే, ఆయన ఇటీవల చాలా సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ఒక సినిమా నుంచి సాలిడ్ అప్డేట్‌ని మేకర్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న మూవీ లో నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ ని రామ్ దేసిన డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య సరికొత్త లుక్‌తో కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ మూవీ నుంచి తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ అయితే మేకర్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ని జనవరి 22న ఉదయం 10.08 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ కి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.
దీంతో నాగ శౌర్య నటిస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అవుతుంది. మరి ఈ మూవీ కి మేకర్స్ ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తారో చూడాలి.