Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇండస్ట్రీలో ఎవరో ఒకరు తెలిసి ఉంటే తప్ప ఠక్కున ఎంట్రీ దొరకదు. ఇండస్ట్రీలో కాస్త పెద్ద తలకాయ మద్దతు మరియు ప్రోత్సాహం ఉండటంతో నాగశౌర్యకు మంచి ఎంట్రీ దక్కింది. ఆయన్ను ప్రేక్షకులు వెంటనే గుర్తించారు. అయితే తాజాగా ‘ఛలో’ చిత్రంతో మంచి కమర్షియల్ సక్సెస్ దక్కింది. ఆ చిత్రాన్ని నాగశౌర్య తల్లి ఉషా గారు నిర్మించారు. దాదాపు 10 కోట్లతో నిర్మించిన ఆ చిత్రం 15 కోట్ల వరకు తెచ్చి పెట్టింది. కొడుకుతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు వెనకాడుతున్న సమయంలో ఒక తల్లిగా కొడుకు భవిష్యత్తు కోసం సినిమాను నిర్మించింది. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో వరుసగా కొడుకుతో సినిమాలు తీయాలని నిర్ణయించుకుంది.
‘ఛలో’ సినిమా సక్సెస్ అవ్వడంతో నాగశౌర్య తన పారితోషికంను అమాంతం పెంచేశాడని, ఆయన ఇప్పుడు చిన్న నిర్మాతలకు అందడం లేదు అంటూ సోషల్ మీడియాలో కొందరు పుకార్లు పుట్టిస్తున్నారు. అయితే ఆ పుకార్లలో ఎంత మాత్రం నిజం లేదు. ఆ పుకార్లు కావాలని నాగశౌర్యకు సన్నిహితులు పుట్టిస్తున్నారు. ఇలా పారితోషికం పెంచాడు అంటే హీరో స్థాయి పెరిగిందని, ఆ హీరో స్టార్ అయ్యాడు అని కొందరు అభిప్రాయ పడతారు. అందుకే నాగశౌర్య స్టార్ అయ్యాడని నమ్మించేందుకు పారితోషికం పెంచాడు అంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న రెండు కొత్త సినిమాలను కూడా ఆయన తల్లి ఉషా గారు నిర్మిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన పారితోషికం పెంచడం ఏంటీ? గతంతో పోల్చితే డబుల్ పారితోషికం తీసుకోవడం ఏంటని సినీ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. పారితోషికం పెంపు అనేది కూడా పబ్లిసిటీ స్టంట్ అని, నాగశౌర్యను ప్రమోట్ చేసేందుకు ఆయన పీఆర్ టీం కాస్త మసాలా ధట్టించి ఇలాంటి పుకార్లు వడ్డి వారుస్తున్నారు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.