నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. శ్రీరామ్ ఆధిత్య దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం నిన్న విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి రివ్యూవర్స్ నుండి మిశ్రమ స్పందన వచ్చింది. కాని సినిమాకు ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చాయి. మొదటి రోజు ఈ చిత్రం భారీ ఎత్తున వసూళ్లు రాబట్టింది. ఇప్పటి వరకు నాగార్జున కెరీర్లో సాధ్యం కాని వసూళ్లు ఈ చిత్రంతో సాధ్యం అయ్యాయి. మొదటి రోజు 12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసిన ఈ చిత్రం లాంగ్ రన్లో కూడా మంచి వసూళ్లను సాధించడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.
మొదటి రోజు ఏడు కోట్లకు పైగా షేర్‌ను దక్కించుకోవడంతో మొదటి వారాంతంలోనే డిస్ట్రిబ్యూటర్లు సగంకు పైగా సేవ్అవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొంది విడుదలైన కారణంగా మంచి ఓపెనింగ్స్ దక్కాయి. పైగా మల్టీస్టారర్ చిత్రాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమా తప్పకుండా డిస్ట్రిబ్యూటర్లను సేవ్ చేయడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు నిర్మాత అశ్వినీదత్ ఇప్పటికే భారీగా లాభాలను దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.