నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం సీక్వెల్ బంగార్రాజు చిత్రంను గత రెండు మూడు సంవత్సరాలుగా అనుకుంటూనే ఉన్నారు. కాని ఇప్పటి వరకు బంగార్రాజు చిత్రం కథ ఫైనల్ కాలేదు. బంగార్రాజు చిత్రం కోసం గత కొంత కాలంగా కుస్తీ పడుతున్న కళ్యాణ్ కృష్ణ ఇంకా కూడా కథకు తుది రూపం తీసుకు రాలేదని తెలుస్తోంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం తర్వాత వరుసగా చిత్రాలు చేస్తున్న నాగార్జున తర్వాత బంగార్రాజు అదుగో ఇదుగో అంటూ వాయిదాలు వేస్తూ వచ్చాడు. తాజాగా ఆఫీసర్ చిత్రంతో ఫ్లాప్ అయిన నాగార్జున బంగార్రాజు చేస్తానంటూ ప్రకటించాడు. కాని ఇప్పటికి కూడా బంగార్రాజు చిత్రం స్టోరీ రెడీ కాలేదని తెలుస్తోంది.
‘బంగార్రాజు’ చిత్రం కంటే ముందే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున మొదట నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. మన్మధుడు 2 అనే టైటిల్‌తో ఈ చిత్రంను రూపొందించేందుకు రాహుల్ రవీంద్రన్ ఒక కథను కూడా సిద్దం చేశాడట. ‘చిసౌ’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న రాహుల్ రవీంద్రన్ త్వరలోనే నాగార్జునతో మూవీని పట్టాలెక్కిస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని స్వయంగా నాగార్జున అన్న పూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడి కాబోతున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు.