ఎవరూ ఫ్రీగా చేయలేదట!

nani about awe movie heroine remunerations

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నాని నిర్మించిన ‘అ!’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాజల్‌, నిత్యామీనన్‌, రెజీనా, అవసరాల శ్రీనివాస్‌, ఇషా ఇంకా పలువురు స్టార్స్‌ ఈ చిత్రంలో నటించారు. ఇంత మంది స్టార్‌ హీరోయిన్స్‌ నటిస్తున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. భారీ ఓపెనింగ్స్‌ ఖచ్చితంగా సాధిస్తుందనే నమ్మకం మొదటి నుండి కూడా వ్యక్తం అవుతుంది. ఇక ఈ చిత్రంలో నటించిన పలువురు హీరోయిన్స్‌ పారితోషికం తీసుకోకుండానే నానిపై అభిమానంతో నటించారు అంటూ నిన్నమొన్నటి వరకు మీడియాలో ప్రచారం జరిగింది. చాలా తక్కువ బడ్జెట్‌తో నాని ఈ చిత్రాన్ని నిర్మించాడని అంతా భావిస్తున్నారు. కాని తాజాగా నాని ఆ విషయాన్ని కొట్టి పారేశాడు.

ఈ చిత్రంలో హీరోయిన్స్‌ పారితోషికం తీసుకోకుండా నటించారు అనే విషయంలో వాస్తవం లేదని, వారి క్రేజ్‌ను బట్టి, వారు కేటాయించిన డేట్ల అనుసారంగా వారి వారి పారితోషికం ఇవ్వడం జరిగిందని, పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా ఎవరు చేయలేదు అని నాని పేర్కొన్నాడు. కొన్ని సందర్బాల్లో కొందరు స్టార్స్‌ ఉచితంగా నటించిన సందర్బాలు ఉన్నాయి. కాని ‘అ!’ చిత్రం కోసం మాత్రం ఆ ముద్దుగుమ్మలు ఎవరు కూడా ఫ్రీగా నటించలేదు అని తేలిపోయింది. దాదాపు 10 కోట్ల బడ్జెట్‌తో ‘అ!’ చిత్రాన్ని నాని నిర్మించాడని, అంతకు మించి బిజినెస్‌ చేసిందని సినీ వర్గాల వారు అంటున్నారు. విడుదలకు ముందే నాని లాభాలను జేబులో వేసుకున్నాడని ట్రేడ్‌ పండితులు అంటున్నారు.