Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మానవత్వాన్ని చాటుకున్నారు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి. తిరుపతి పర్యటనలో ఉన్న నన్నపనేని కొర్లగుంట జంక్షన్ వైపు వెళుతుండగా రాళ్ళు కొడుతూ ఒక మహిళ చేతికి గాయమై రక్తస్రావం అవ్వడాన్ని గమనించారు. వెంటనే కారు నుంచి కిందకు దిగి మహిళ వద్దకు వెళ్ళి బ్యాండేజ్ తీసుకురమ్మని సెక్యూరిటీని పంపించారు. ఇంతలో జనం చుట్టుముట్టారు. రాళ్ళు కొట్టే వారితో అరగంటకుపైగా మాట్లాడిన నన్నపనేని వారి పరిస్థితి విని చలించిపోయారు.
చంటిబిడ్డలతో కనీసం ఇళ్ళు కూడా లేని దీనస్థితిని గమనించారు. వెంటనే తన పర్సు తీసి అందరినీ పిలిచి డబ్బులివ్వడం మొదలెట్టారు. ఎంతమంది ఉంటే అందరికీ డబ్బులిచ్చారు. నన్నపనేనిని చూసి రెండు చేతులు జోడించి దన్నంపెట్టారు రాళ్ళు కొట్టే కూలీలు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాళ్ళు కొడుతున్న వారందరికీ ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు నన్నపనేని రాజకుమారి. అక్కడి నుంచి వెళుతూ రాళ్ళు కొట్టేందుకు ప్రయత్నించి చివరకు అది సాధ్యం కాకపోవడంతో నన్నపనేని అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
మరిన్ని వార్తలు
పాత మొగుడు కొట్టి మరీ కొత్త పెళ్లి చేశాడా?