మనసే మనిషిని నిర్దేశిస్తుంది. ఆలోచనలు, ఆచరణ, ఆరోగ్యం అన్నీ దానిపైనే ఆధారపడి ఉంటాయి. మనసు అనేది కన్పించకపోయినా దాని మూల కేంద్రం మెదడే. అదే లేకుంటే మనిషి బతుకు గల్లంతౌతుంది. సమాజంలో, వ్యక్తిగతంగా కర్తవ్యాలను నెరవేర్చుకుంటూ, లక్ష్యాలను చేరి, ఆనందంగా జీవించేందుకు ఇతర శారీరక అవయవాలతోబాటు మానసిక ఆరోగ్యం సంతృప్తిక రంగా ఉండేలా చూసుకోవాలి. మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోతే ఆ ప్రభావం ఆ వ్యక్తికే పరిమితం కాదు. అది సమాజంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతి ఒక్కరికీ శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. దీర్ఘకాలికంగా ఉండే శారీరక సమస్యలు కొన్నిసార్లు మెదడు మీద కూడా ప్రభావం చూపుతాయి. అలాగే మానసిక అనారోగ్యం మనిషిని శారీరకంగా క్షీణింపజేస్తుంది. కనుక అటు శారీరకంగాను, ఇటు మానసికంగానూ దృఢం గా ఉండడం ఎవరికైనా అవసరం. మానసిక రోగం పేరు చెప్తే చాలు అందరికీ భయం. పొరపాటున అలాంటి వ్యాధి సోకితే జబ్బు తీవ్రత కంటే ఎక్కువగా తల్లడిల్లిపోతారు.
అందుకే ఈ పరిణామాలు అన్నీ తెలుసుకున్న నారయణ సంస్థల ఎండీ నారాయణ విద్యాసంస్థలు 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా విద్యార్థుల్లో మానసిక రుగ్మతలను రూపుమాపేందుకు ‘దిశ’ పేరుతో కార్యక్రమాన్ని రూపొందించారు. దేశవ్యాప్తంగా మానసిక రుగ్మతతో బాధపడే విద్యార్థులందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. మానసిక రుగ్మతను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించకపోవడం, మానసిక రుగ్మతతో బాధపడే వారిని డాక్టర్‌కు చూపించాలనే ఆలోచన రాకపోవడం వంటి అంశాలపై ప్రజల్లో విసృ్తత అవగాహన కల్పించి, మానసిక రుగ్మతను పారదోలడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. మానసిక సమస్యలున్న విద్యార్థులు 18004191828 హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేసి ఉచితంగా సేవలు పొందొచ్చని ఆమె తెలిపారు.