ఐఐటీ- జేఈఈ అడ్వాన్స్డ్ 2018 ఫలితాల్లో నారాయణ ప్రభంజనం సృష్టించింది. ఈ విభాగంలో విజయాలు నారాయణకు కొత్త కాకపోయినా ఈ ఏడాది ప్రత్యర్ధులు ఎవరూ కనీసం పోటీ అని చెప్పుకునే అవకాశం కూడా లేకుండా ఏకఛత్రాధిపత్యం వహించింది. ఐఐటీ అనగానే నారాయణ పేరే ఎందుకు గుర్తుకు వస్తుందో ఇంకోసారి నిరూపితం అవుతోంది. జాతీయ స్థాయిలో రెండు ఫస్ట్ ర్యాంక్ లతో పాటు పదిలోపు , వందలోపు గణనీయమైన ర్యాంకులు పొందింది. టాప్ టెన్ లోపు 1 ,1 , 2 , 2 , 3 , 5 ,5 , 6 ,6 ,9 , 9 , 10 , 10 ర్యాంకులు సొంతం చేసుకున్న నారాయణ టాప్ టెన్ లోపు 13 , టాప్ హండ్రెడ్ లోపు 96 ర్యాంకులు సాధించింది. నారాయణ ప్రస్థానంలో సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించడమే కాదు. పోటీ సంస్థలు షాక్ తినేలా చేసింది.
దేశవ్యాప్తంగా రెండు లక్షల మంది పోటీ పడిన ఈ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన నారాయణ ఇందుకు సంబంధించి విజయోత్సవ కార్యక్రమం నిర్వహిచింది. ఆ సందర్భంగా నారాయణ విజయాల వెనుక వున్న కృషి , అకాడమిక్ వ్యూహాలను ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి. సింధూర , డైరెక్టర్ పి. శరణి వివరించారు. నారాయణ రూపొందించిన ప్రణాళికతో పాటు ఇందుకోసం ప్రత్యేక రీసెర్చ్ చేసిన విధానాన్ని వారు తెలిపారు. ఆన్ లైన్ మాక్ పరీక్షలతో పాటు నారాయణ ఒక్కో విద్యార్థి శక్తి, సామర్ధ్యానికి అనుగుణంగా ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా ఈ విజయాలకు కారణం అని సింధూర , శరణి చెప్పారు. మున్ముందు కూడా రీసెర్చ్ మీద ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత ప్రమాణాల దిశగా ప్రయాణం సాగిస్తామని నారాయణ సంస్థ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ పూనింది.