Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నరేంద్రమోడీ ఇందిరాగాంధీని మించిపోతున్నారు. అధికారంలోకి రావడం కోసం ప్రతిపక్షాలు ఏలుతున్న రాష్ట్రాల్లో ఏం చేసినా తప్పు లేదన్న దారుణ స్థితికి దిగజారారు. పశ్చిమ్ బంగ లో దీదీని నేరుగా ఢీకొట్టలేకపోతున్న మోడీ.. ఇప్పుడు గూర్ఖాల్యాండ్ ను అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసైనా అధికారంలోకి రావాలనుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఊరందరి కంటే ముందే ఓ ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసి రాష్ట్ర విభజనకు నాంది పలికిన బీజేపీ.. ఇప్పుడు బెంగాల్ ను కూడా ముక్కలు చేయాలని కంకణం కట్టుకుంది.
గూర్ఖా ల్యాండ్ ఉద్యమం గూర్ఖా జన ముక్తి మోర్చా నేతృత్వంలో జరుగుతోంది. ఆ పార్టీ కేంద్రంలో ఎన్డీఏకు భాగస్వామి. మోడీ మాట చెబితే ఉద్యమం ఆగిపోతుంది. కానీ మోడీ ఉలకరు. పలకరు. పైగా అదనపు బలగాల పేరుతో కాలయాపన చేస్తూ.. అటు సామాన్యులు, ఇటు సైనికుల విలువైన ప్రాణాలు బలిగొంటున్నారు. మమత మాత్రం ప్రత్యేక రాష్ట్రానికి ససేమిరా అంటున్నారు.
ఏదో ఓ రకంగా మమత పాపులార్టీకి దెబ్బేయాలని బీజేపీ ఎప్పట్నుంచో అవకాశం కోసం చూస్తోంది. ఇప్పుడు గూర్ఖాల్యాండ్ ఉద్యమం చేతికి రావడంతో.. ఇంక మమత సర్కారుతో తొండాట మొదలెట్టింది. ఓవైపు అదనపు బలగాలు పంపిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితి నివేదించడం లేదని చిలక పలుకులు పలుకుతోంది. అటు గూర్ఖా జన ముక్తి మోర్చా నేత బిమల్ గురుంగ్ కోల్ కతాకు మిస్సింగ్.. ఢిల్లీకి మాత్రం హాజరు. ఈ పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ కంటే బీజేపీ ప్రమాదకరంగా తయారవుతుందనేది కాదనలేని వాస్తవం.