Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆపరేషన్ ఆకర్ష్ కు వైఎస్ అయితే.. ఆఫరేషన్ వికర్ష్ కు పెద్దదిక్కుగా మోడీ అవతరిస్తున్నారు. సొంత పార్టీ నేతల్నే అవమానిస్తున్న మోడీ.. అసంతృప్తుల్ని పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ నుంచి ఏకైక మంత్రి దత్తాత్రేయను తప్పించిన మోడీ.. ఆయన స్థానంలో ఎవరికీ చోటివ్వలేదు. ఇక ఏపీలో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లినా.. ఆయనకు బదులుగా హరిబాబుకు పదవి ఇస్తామని ఊరించి ఉసూరుమనిపించారు.
నిజానికి హరిబాబు బీజేపీ సీనియర్ నేత. ఆయన వెంకయ్య కుడిభుజం అని చెబుతారు. వృత్తిరీత్యా ప్రొఫెసర్ అయిన హరిబాబు.. అందర్నీ కలుపుకుపోవడంలో దిట్ట. ఏఫీ సీఎం చంద్రబాబుతో కూడా కోఆర్డినేషన్ చేసుకోగల అనుభవం ఆయనకు ఉంది. అలాంటి నేతకు మంత్రి పదవి ఇస్తామని ఆశపెట్టి.. తీరా కుటుంబసమేతంగా ఢిల్లీ వెళ్లాక మొండి చేయి చూపడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.
ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలు, ఎక్కువ సీట్లు గెలిచిన రాష్ట్రాలకే క్యాబినెట్ బెర్తులైతే.. ఇక భవిష్యత్తులో బీజేపీ నుంచి ఇతర పార్టీలకు వలసలు ఉంటాయని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సొంత పార్టీ నేతల్నే గౌరవించని మోడీ.. ఇతర పార్టీల నుంచి వచ్చినవారిని ఏం గౌరవిస్తారని వాదన మొదలైంది. ఇది మరింత పెద్దదైతే.. మోడీకి మిత్రులు కూడా దూరమవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని వార్తలు: