ఎవరైనా ఎక్కడైనా తాము అధికారంలోకి వస్తే ఏ పధకానికి సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం పెడతారో చెబుతారు. కానీ వైసీపీ తీరు మాత్రం అలా లేదు. తాము అధికారంలోకి వచ్చిన గంటలోపే సీఎం చంద్రబాబు పేషీలో పనిచేసిన అధికారుల పని పడతామని ఇంతకుముందు జగన్ కుడిభుజం లాంటి విజయసాయి రెడ్డి హెచ్చరించారు. ఆ హెచ్చరిక గురించి ఎన్ని విమర్శలు వచ్చినా ఆ పార్టీ నాయకులు లెక్క చేయడం లేదు.
తాజాగా వైసీపీ తరపున ఘాటు వ్యాఖ్యలు చేసిన చరిత్ర వున్న నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇంకో సారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన మీద ఓ న్యూస్ ఛానల్ విలేకరి నేరుగా పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఫోన్ లో ఎమ్మెల్యే సదరు జర్నలిస్ట్ ని బెదిరించినట్టు ఆరోపణలు వున్నాయి.
2019 ఎన్నికల్లో నెల్లూరు లో మంత్రి నారాయణ గెలుస్తాడని రాసినందుకు ఆ విలేకరి మీద ఎమ్మెల్యే కోప్పడినట్టు సమాచారం. పైగా ఇంకొన్ని నెలల్లో అధికారంలోకి వస్తున్నాం, రాగానే నిన్ను చంపేస్తాం అని అనిల్ కుమార్ తనను ఫోన్ లోనే వార్నింగ్ ఇచ్చినట్టు ఆ విలేకరి జిల్లా