తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2 ఆసక్తికరంగా సాగుతుంది. నాలుగు వారాలు పూర్తి చేసుకుని అయిదవ వారంలోకి అడుగు పెట్టిన బిగ్‌బాస్ ఆసక్తికర మలుపులతో సాగుతోంది. గత కొన్ని రోజులుగా తేజస్వి మరియు సామ్రాట్ల మద్య వ్యవహారం సాగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ తర్వాత తనీష్ మరియు దీప్తి సునయనలు ప్రేమలో మునిగి తేుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలా ఈ రెండు జంటలు ప్రేమలో ఉన్నాయా లేవా అనే అనుమానాల మద్య తాజాగా జరిగిన సంఘటన వీళ్ల మద్య ఉన్నది ప్రేమే అంటూ తేల్చి చెప్పేసింది. బిగ్‌బాస్ సీజన్ 2 అయిదవ వారం ఎలిమినేషన్ పక్రియ నిన్న జరిగింది. ఎలిమినేషన్లో భాగంగా అందరు కూడా ఎలిమినేషన్ జాబితాలో ఉంటారు. అయితే వారి కోసం బిగ్‌బాస్ చెప్పిన వారు ఏదైనా త్యాగం చేస్తే ఎలిమినేషన్ నుండి సేవ్ అవుతారు.
తేజస్వి కోసం సామ్రాట్ గడ్డం మరియు మీసాలు తీసేశాడు. తేజస్వి అడగడమే ఆలస్యం వెంటనే గడ్డం మరియు మీసాలు తీసేశాడు. తనకు ఎంతో ఇష్టం అయిన గడ్డం మరియు మీసాలను సామ్రాట్ తీయడంతో తేజస్వి చాలా సంతోషించి, ముద్దు పెట్టుకుని మరీ అతడిని గట్టిగా హగ్ చేసుకుంది. ఆ తర్వాత తనీష్ కోసం దీప్తి సునయన తన జుట్టును కత్తిరించుకుంది. తనీష్‌తో ఈమెకు ఉన్న ప్రేమ కారణంగానే ఎంతో ఇష్టం అయిన జుట్టును కత్తిరించుకుంది. బుజాల వరకు దీప్తి తన జుట్టును కత్తిరించుకోవడం అందరికి ఆశ్చర్యంను కలిగించింది. మొదట కాస్త సంశయించినా కూడా దీప్తి ఆ తర్వాత తనీష్ కోసం అనుకుంటూ జుట్టు కత్తిరించుకుంది. ఒక అమ్మాయి, అదీ సెలబ్రెటీ అయిన అమ్మాయి జుట్టు కత్తిరించుకునేందుకు ముందుకు రావడం నిజంగా డేరింగ్ విషయం. అది అందరి కోసం చేయరు. ఆమె ప్రేమిస్తుంది కనుకే ఈ నిర్ణయం తీసుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ రెండు జంటలు నిజంగానే ప్రేమలో ఉన్నాయని తేలిపోయింది.