Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నేనింతే. అదో టైపు. ఎవడేమన్నా నా ఇష్టం. ఇదీ పవన్ తీరు. ఇప్పటిదాకా సినిమా హీరో కాబట్టి సరిపోయింది కానీ.. పాలిటిక్స్ లోకి వచ్చాక కూడా అదే కన్ఫ్యూజన్ కొనసాగిస్తున్నారు పవన్. లేటెస్ట్ గా గౌరీ లంకేష్ హత్యపై స్పందించారు. జర్నలిస్టు గౌరీ హత్యను ఖండిస్తూనే.. విచారణ జరగకుండానే హిందుత్వ శక్తుల ప్రమేయం ఉందని అనలేనని స్పష్టం చేశారు పవన్. ఈ కామెంట్ జనరల్ గా రచ్చకు దారితీయాలి.. కానీ పవన్ చేసిన సిల్లీ మిస్టేక్ హైలైట్ అయింది.
గౌరీ లంకేష్ కు బదులుగా గౌరీ శంకర్ అని ట్వీట్ చేయడంతో.. నెటిజన్లు భగ్గుమన్నారు. జనసేన అధినేతగా, రాజకీయాల్ని మారుస్తానంటూ చెబుతున్న పవన్ ముందు లోకజ్ఞానం గురించి తెలుసుకోవాలని వాళ్లు ఎద్దేవా చేస్తున్నారు. ఆ తర్వాత ఎప్పటికో చూసుకున్న పవన్ గౌరీ శంకర్ ను గౌరీ లంకేష్ గా చదువుకోవాలని రీట్వీట్ చేసినా.. అప్పటికే పోవాల్సిన పరువు పోయింది.
పవన్ ఈ మధ్య కాలంలో సమకాలీన అంశాల మీద కూడా స్కూల్ పిల్లాడిలా స్పందిస్తున్నారు. ప్రతి అంశంపై స్పష్టమైన అభిప్రాయం చెప్పకుండా తత్వవేత్తలా బదులు చెబుతున్నారు. ఈ మాత్రం దానికి కొత్తగా పార్టీ పెట్టక్కర్లేదు. సమాజంలో ఇప్పటికే చాలా మంది స్వామీజీలు, బాబాలు ఉన్నారు. కానీ రాజకీయ నేతల నుంచి జనం తక్షణ పరిష్కారాలు ఆశిస్తారు. పవన్ ఆ విషయంలో కసరత్తు చేయకపోతే.. ఓ జోకర్ గా మిగిలిపోతారనేది నెటిజన్ల అభిప్రాయం.
మరిన్ని వార్తలు: