బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘స్త్రీ’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెలుగు నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణల ద్వయం ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంగా ఈ చిత్రం రూపొందింది. ‘సాహో’ బ్యూటీ శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో టైటిల్ రోల్‌లో నటించిన విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రంను సౌత్‌లో రీమేక్ చేసేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
తెలుగులో ఈ చిత్రంను సమంత లేదా నిహారిక చేసే అవకాశం ఉంది. సమంత ఇటీవలే యూటర్న్ చిత్రం చేసి నిరాశకు గురైంది. ఇలాంటి సమయంలో వెంటనే మరో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం అంటే ఆమె ఆసక్తి చూపడం లేదట. దాంతో ఆమె స్థానంలో మెగా డాటర్ నిహారికను రంగంలోకి దించాలనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. నిహారిక అయితే ‘స్త్రీ’ చిత్రంకు మంచి న్యాయం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నిహారిక కూడా చాలా ఆసక్తిగానే ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం అవుతుందని సమాచారం అదుతుంది. హిందీలో 15 కోట్లతో రూపొందిన స్త్రీ చిత్రాన్ని తెలుగులో 10 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.