మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి దాదాపు అందరికీ తెలుసు . మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి చిన్న వెబ్ సిరీస్ లు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇక ఆతర్వాత నిహారిక యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి ఒక మనసు అనే మూవీ లో నటించింది. ఈ మూవీ అంతగా సక్సెస్ కాకపోవడంతో,, ఈ బ్యూటీ హీరోయిన్ గా అంతగా మూవీ లు చేయడం లేదు. అప్పుడప్పుడు మూవీ లలో కనిపిస్తూ అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లు చేస్తూ.. నిర్మాతగా నిహారిక ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లి జరిగింది.
కానీ ఆ పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగానే నిలిచిపోయింది. పెళ్లి అయిన కొద్ది కాలానికే వీరు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందరికీ ఒక షాక్ ఇచ్చారు. ఇక ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో నిహారిక విడాకులు విషయం ఎంత హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. నిహారికను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. మెగా ఫ్యామిలీ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే నిహారిక విడాకులకు ఒక యూట్యూబర్ కారణం అంటూ వార్తలు వచ్చాయి. ఆ యూట్యూబర్ తో నిహారిక క్లోజ్ గా ఉండడం వల్లనే నిహారిక భర్త తనమీద అనుమానపడి విడాకులు ఇచ్చేశాడనే వార్తలు బాగా వస్తున్నాయి. అంతేకాదు.. మెగా ఫ్యామిలీ పై కూడా నెటిజన్స్ చాలా దారుణంగా ట్రోలింగ్స్ చేశారు. నిహారిక యూట్యూబర్ కి మధ్య ఏదో రిలేషన్ షిప్ ఉందని వార్తలు వచ్చాయి.
అయితే యూట్యూబర్ తో తనపై వస్తున్న వార్తలకు మాత్రం నిహారిక ఒకే ఒక్క పోస్ట్ తో చెక్ పెట్టేసింది. ఆ యూట్యూబ్ ఎవరో కాదు నిఖిల్ విజయేంద్ర సింహ. తాజాగా నిఖిల్ బర్త్ డే సందర్భంగా నిహారిక ఒక పోస్ట్ వేసింది . నిహారిక నిఖిల్ తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ నిఖిల్ కి బర్త్ డే విషెస్ చెప్పిందంట . నువ్వు మొదట్లో హోస్ట్ గా చేసి ఆ తర్వాత కో యాక్టర్ గా మారిపోయావు , ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి ప్రస్తుతం నా చిట్టి తమ్ముడిగా మారావు . మనం ఇంకా ఎంతో జర్నీ చేయాల్సి ఉంది. ఎంతో మంచి మనసున్న వాళ్ళందరిలో నువ్వు కూడా ఒకడివి. లవ్ యు నిక్కి హ్యాపీ బర్త్ డే నాన్న నిహారిక పోస్ట్ చేసింది. ప్రస్తుతం నిహారిక చేసిన పోస్టులో నా చిట్టి తమ్ముడు అంటూ చెప్పడంతో వీరిద్దరిపై వస్తున్న వార్తలకు చెక్ పడింది.