కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి మహిళా మంత్రిగా నిర్మల రికార్డు సృష్టించారు. భారత దేశం తన ప్రజాస్వామ్యాన్ని సెలబ్రేట్ చేసుకుందన్నారు. ఓటర్లు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇటీవల ముగిసిన ఎన్నికలు నవ భారతాన్ని ప్రతిబింబించాయన్నారు. ఓటర్లు భారీ స్థాయిలో ఓటింగ్లో పాల్గొన్నారన్నారు. మోదీ సర్కార్కు తమ మద్దతును తెలిపారన్నారు.