దర్శకురాలు ప్రియదర్శిని దర్శకత్వంలో తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత నేత స్వర్గీయ శ్రీ జయలలిత గారి జీవిత చరిత్రను ది ఐరన్ లేడీ పేరుతో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. జయలలిత గారి పాత్రలో మలయాళీ భామ నిత్యమీనన్ నటిస్తుంది. తమిళ ప్రజల చేత అమ్మ గా పిలుపించుకునే జయలలిత గారి పాత్రపై నిత్యమీనన్ మొదటిసారిగా స్పందించారు. నిత్య మాట్లాడుతూ….. తమిళ ప్రజలు జయలలిత గారిని ఏంతగా అభిమానిస్తారో ఆమె పాత్రలో నేను నటిస్తుంటే ఆమె గురుంచి తెలుస్తుంది. ఆమె మీద అభిమానం గౌరవం నాకు మరింత పెరిగేల చేసింది. ఎవరినైనా అమ్మ గా పిలిపించుకోవాలంటే, తను ఏంతగా తమిళ ప్రజలకు సేవ చేసిందో అర్ధం అవ్వుతుంది. అందుకనే ఆమెను తమిళ ప్రజలు అమ్మ గా పిలుచుకుంటారు.
రాజకియలో ఎన్నో విజయాలు సాదించి ఇండియన్ పాలిటిక్స్ లో ఆమె పేరును తర తరాలకు చెప్పుకునే విధంగా ఆమె చేసిన సేవలు మరవలేము. రాజకియనాయకురాలిగా, సినిమా నటిగా ఎన్నో సినిమాలు నటించి ఎన్నో అధ్బుతమైన విజయాలను అందుకుంది. రాజకియలో ఆమె చేసిన సేవలు ఇంకెవ్వరు చెయ్యలేరు. అన్నారు. నిత్యమీనన్ నటిస్తున్న ది ఐరన్ లేడీ పాత్ర యొక్క ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం ఇటివల విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ కి అక్కడి ప్రజలు, అభిమానులు, రాజకీయ నాయకులనుండి మంచి రెస్పాన్సు వచ్చింది. తమిళ అమ్మ అభిమానులు కూడా అంతటి అంత బలమైన రాజకీయ నాయకురాలి పాత్ర పోషించాలంటే. అంతే టాలెంటెడ్ యాక్టింగ్ స్కిల్ల్స్ ఉన్న నిత్యమీనన్ వల్లనే సాధ్యం అవ్వుతుందని దర్శకనిర్మాతలతో అమ్మ అభిమానులు అంటున్నారు. తమిళ ప్రజలు అమ్మను ఏలా రిసీవ్ చేసుకుంటారో చుడాలిమరి.