Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఢిల్లీలో మోడీ ప్రధాని అయిన దగ్గర్నుంచి ఆయన్ను దేవదూత అని పొగిడేసి వెంకయ్య తంతే బూరెల గంపలో పడ్డారు. అద్వానీ శిష్యుడనే ముద్ర నుంచి బయటపడి మోడీకి ఇష్టుడిగా మారడం వెనుక వెంకయ్య ఎన్నో చక్రాలు తిప్పారు. ఆ చాణక్యం నచ్చే మైనార్టీ ఉన్న రాజ్యసభలో ప్రభుత్వానికి సాయం చేస్తారని వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా పంపుతున్నారు. కానీ భజనపరుపడిగా ఆయన లేని లోటు తెలియకుండా ఒకప్పటి మోడీ శత్రువు ఇప్పుడు ప్రధానికి సహకరిస్తున్నారు.
బీహార్ సీఎం నితీష్ కుమార్. ఒకప్పుడు ప్రధాని అభ్యర్థిగానే మోడీ పనికారారన్న వ్యక్తి.. ఇప్పుడు మోడీకి పోటీ ఎక్కడుందని అడుగుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మోడీని ఆపే లీడర్ ఎవరూ లేరని, మోడీకి కాక ఇంకెవరికి ఓటేస్తారని జనాన్ని కూడా నిలదీసినంత పనిచేశారు నితీష్. నితీష్ ను చూసి బీజేపీ నేతలకే టెన్షన్ మొదలైంది. తమకంటే ఆయనే ఎక్కువగా మోడీని పొగడటం వారిని ఆశ్చర్యపరుస్తోంది.
నిజానికి మోడీ అంటే బీజేపీ మొత్తం ఏకాభిప్రాయం లేదు. కానీ పార్టీకి రికార్డు మెజార్టీ తెచ్చిపెట్టిన తర్వాత, ముఖ్యంగా యూపీ గెలుపు తర్వాత మోడీని కాదనే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. చివరకు ఆరెస్సెస్ కూడా సలహాలివ్వడమే కానీ, చెప్పింది చేయాలనే దశ నుంచి దిగజారింది. అందుకే అటు ఆరెస్సెస్, ఇటు బీజేపీ నేతల మధ్య ఉన్న మోడీ భజన పోటీని.. నితీష్ వచ్చి మరింత రంజుగా మార్చారు.
మరిన్ని వార్తలు: