నన్ను మించిన నీతిమంతుడు లేడంటున్న కుమారస్వామి
కర్ణాటకలో ఎన్నికలకు ముందే రసవత్తర రాజకీయం మొదలైంది. ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ప్రతిపక్షాలన్నీ కలిసి విజయవంతంగా అవినీతిపరుడనే ముద్ర వేశాయి. దీంతో గత ఎన్నికల నాటి ఆయన ఛరిష్మా మంచులా కరిగిపోయి, ఇప్పుడు ఓటమి అంచున నిలబడ్డారు. రుణమాఫీ అస్త్రం కూడా పెద్దగా వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.
మరోవైపు మరో మాజీ సీఎం కుమారస్వామిని కూడా raప్రత్యర్థులు తిరుగులేని గేమ్ ప్లాన్ రెడీ చేశారు. కుమారస్వామిపై మైనింగ్ ఆరోపణలు చేసి.. ఆయన అకర్మాస్తులపై త్వరలోనే అరెస్ట్ వారెంట్ ఖాయమని వార్తలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అయితే అరెస్ట్ ముప్పు తప్పించుకున్న కుమారస్వామి.. ఆరోపణల్లో వాస్తవం లేదని ఎదురుదాడికి దిగారు.
నిజంగా ఎలాంటి అక్రమాలు చేయకపోతే కుమారస్వామి ఎందుకు అంత ఉలిక్కిపడుతున్నారని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికే అవుటాఫ్ రేస్ అయిన కాంగ్రెస్ కు జతగా జేడీఎస్ ను కూడా చేర్చితే.. ఇక తమ అధికార పీఠానికి ఎదురుండదని చెబుతున్నాయి బీజేపీ వర్గాలు. దీంతో కర్ణాటక కోసం బీజేపీ మంచి వ్యూహాలే రెడీ చేసినట్లు తెలుస్తోంది.