అయ్యో.. ‘నోటా’కు ఇలా జరిగింది ఏంటీ…?

విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘నోటా’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. అక్టోబర్‌ 5న భారీ ఎత్తున తెలుగు మరియు తమిళంలో విడుదల కాబోతున్న ఈ చిత్రంకు సెన్సార్‌ బోర్డు నుండి క్లీయరెన్స్‌ వచ్చింది. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యూ సర్టిఫికెట్‌ను దక్కించుకుంది. ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాల తర్వాత విజయ్‌ దేవరకొండ నటించిన సినిమా అంటే ఖచ్చితంగా ముద్దు సీన్స్‌ ఇంకా రొమాంటిక్‌ సీన్స్‌ ఉంటాయని అంతా అనుకుంటారు. కాని ఈ చిత్రానికి యూ రావడంతో అంతా కూడా షాక్‌ అవుతున్నారు.

nota-movie

విజయ్‌ దేవరకొండ అభిమానులు కోరుకున్నట్లుగా ఈ చిత్రంలో అవేవి ఉండవని, చాలా కామన్‌ సినిమా మాదిరిగానే ఇది ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్‌ బోర్డు నుండి ఎప్పుడైతే యూ వచ్చిందో ప్రేక్షకులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ నుండి ఇలాంటి సినిమాను తాము ఆశించడం లేదు అంటున్నారు. నోటాలో కూడా ముద్దు సీన్‌ ఉంటుందని టీజర్‌ మరియు ట్రైలర్‌లో చూపించే ప్రయత్నం చేశారు. కాని తీరా చూస్తే ఈ సినిమాకు యూ రావడం చర్చనీయాంశం అవుతుంది. నోటాతో తమిళంలో మనోడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

nota