Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ చిత్రాల్లో అతి పెద్ద డిజాస్టర్‌గా ‘శక్తి’ నిలిచిన విషయం తెల్సిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే నిలిచి పోయే డిజాస్టర్‌గా మిగిలింది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించిన విషయం తెల్సిందే. ఆ దెబ్బకు ఎన్టీఆర్ సినిమాల ఎంపిక విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అప్పటి నుండి కూడా ఆర్మీ ఆఫీసర్ పాత్రల జోలికి ఎన్టీఆర్ వెళ్లింది లేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్మీ నేపథ్యంలో అని, ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.
అజ్ఞాతవాసి చిత్రంతో భారీ డిజాస్టర్‌ను సొంతం చేసుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రంపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ సూపర్ హిట్‌ను దక్కించుకోవాలనే పట్టుదలతో దర్శకుడు త్రివిక్రమ్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడు. త్రివిక్రమ్‌పై నమ్మకంతో ఎన్టీఆర్ ఆర్మీ పాత్రకు భయపడకుండా చిత్రాన్ని చేస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక సీనియర్ హీరోయిన్స్ ఇద్దరు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సీనియర్ హీరోయిన్స్ ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సంగీతాన్ని థమన్ అందిస్తున్నాడు. రాధాకృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.