ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రను అతని పేరు మీదే ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో రూపొందించాడు ది గ్రేట్ డైరక్టర్ జాగర్లమూడి క్రిష్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్నది. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కు వెళ్ళింది. అక్కడ ఎన్టీఆర్ బయోపిక్ లో ఏ మాత్రం కట్స్ లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్ ను తెచ్చుకుంది. ఎన్టీఆర్ జీవిత ఆధారంగా రూపొందుతుంది కావున ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సెన్సార్ బోర్డు కూడా సముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇంకా సినిమా నిడివి కూడా కూడా 2గంటల 50 నిముషాలు గా ఉన్నట్లు తెలుస్తుంది.
సినిమాలో కంటెంట్ బాగుంటే పెద్ద సినిమాలు కూడా భాగా అడుతాయని ఇంతకు ముందు వచ్చిన సినిమాలే ఉదాహరణ అందులో మహానటి, ఆర్జున్ రెడ్డి, భరత్ అనే నేను సినిమాలు ముందుంటాయి. తాజాగా ఇదే లిస్టు లోకి ఎన్టీఆర్ బయోపిక్ వచ్చి చేరింది. ఎన్టీఆర్ కథానాయకుడు లో మాత్రం ఎన్టీఆర్ సినిమా మరియు అతని బాల్యంను చూపిస్తారని ఇదివరకే విడుదలైన ట్రైలర్ చూస్తే అర్ధం అవ్వుతుంది. అసలు కథంత ఎన్టీఆర్ కథనయకుడుతోనే ఉన్నది ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలు ఎంటివి, కేంద్రంపై ఏలాంటి పోరాటం చేశాడు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎన్టీఆర్ ఏలా ఓడించాడు, అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నాదెండ్ల బాస్కర్ తో ఎన్టీఆర్ కు ఉన్న విభేదాలన్ని మనం ఎన్టీఆర్ మహానయకుడులో చూడవచ్చు. కానీ ప్రస్తుతం తెలుగు దేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సమీకరణలు మరడంవలన అంత పెద్దగా ఏమి ఉండదు. కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీ లో జరిగిన గొడవలు ఎంటివి అనేవి సినిమాపై ఇంటరెస్ట్ పెంచేస్తుంది. వాటిగురుంచి మొత్తం తెలుసుకోవాలంటే జనవరి 10న కథానాయకుడు ఫిబ్రవరి7 న మహానాయకుడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. అప్పటి వరకే అగలిసిందే.