Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్ బాస్ షో అనేగానే తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన బిగ్ బాస్ షో తెలుగులో ఎలా ఉండబోతుంది, మొదటి సీజన్లో ఎవరు పాల్గొనబోతున్నారు, ఎన్టీఆర్ ఎలా హోస్ట్ చేస్తాడు అనేది అందరిలోనూ జరుగుతున్న చర్చ.
గత రెండు నెలలుగా జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది. బిగ్ బాస్ షో ప్రారంభం అయ్యింది. సెబ్రెటీలు ఎవరు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. బిగ్ బాస్ షోలో కొందరు ప్రేక్షకులకు సుపరిచితులైన సెలబ్రెటీలు కాగా, మరి కొందరు కాస్త పరిచయం ఉన్న వారు ఉన్నారు. మొత్తంగా అన్ని రకాల వారు ఈ షోలో కనిపించబోతున్నారు. 14 మంది సెలబ్రెటీలతో షో ప్రారంభం అయ్యింది. వారంలో ఒక్కరు చొప్పున ఎలిమినేట్ కాబోతున్నారు. ఆ 14 మంది జాబిత ఇదిగో మీకోసం.
1. అర్చన
2. సమీర్
3. శివ బాలాజీ
4. సంపూర్ణేష్ బాబు
5. కల్పన
6. మధుప్రియ
7. కత్తి కార్తీక
8. ముమైత్ ఖాన్
9. మహేష్ కత్తి
10. జ్యోతి
11. ప్రిన్స్
12. హరితేజ
13. ఆదర్ష్
14. ధన్‌రాజ్
మరిన్ని వార్తలు