తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2లో ముగ్గురు సామాన్యులను తీసుకోవడం జరిగింది. సామాన్యులను అయితే తీసుకున్నారు కాని మొదటి రెండు వారాల్లోనే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలోనే బయటకు వచ్చేసిన ఆమె గురించి ఎవరికి పట్టింపు లేదు. కాని రెండవ వారంలో ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడుపై అందరి దృష్టి ఉంది. ఆయన ఇంట్లో ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈయన్ను ప్రేక్షకులు మళ్లీ కోరుకుంటున్నట్లుగా ఒక సోషల్ మీడియాలో నిర్వహించిన సర్వేలో వెళ్లడి అయ్యింది. అందుకే స్టార్ మా వారు నూతన్ నాయుడును వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోనికి పంపించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతుంది.
ఒక వేళ బిగ్‌బాస్ నిర్వాహకులు నూతన్ నాయుడును లోనికి పంపిస్తే సంచలనం అన్నట్లుగా చెప్పుకోవచ్చు. గతంలో కొన్ని సందర్బాల్లో బిగ్‌బాస్‌లో ఎలిమినేట్ అయిన వారు మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఈ సీజన్లో కూడా నూతన్ నాయుడును రీ ఎంట్రీ ఇప్పించేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మీడియాలో వస్తున్న ఈ వార్తలపై మాటీవీ వర్గాల వారు స్పందిస్తూ ఆ ఆలోచనే లేదు అంటూ చెబుతున్నారు. ఇక్కడ చెప్పుకోవల్సిన విషయం ఏంటీ అంటే బిగ్‌బాస్ నిర్వాహణకు మాటీవీలో వర్క్ చేసే వారికి సంబంధం లేదు. అందుకే నూతన్ నాయుడును బిగ్‌బాస్ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని ఇప్పటికే బిగ్‌బాస్ నుండి బయటకు వచ్చి మూడు వారాలు అయిన నూతన్ నాయుడును మళ్లీ వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా తీసుకోవడం అనేది టెక్నికల్‌గా సాధ్యం అయ్యే పని కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.