రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ కొద్ది సేపటి క్రితం వెలువడిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ తో పాటే ఏపీలోని అరకు అసెంబ్లీ నియోజకవర్గానికీ ఉపఎన్నిక జరగొచ్చని భావించారు. కానీ, ఆ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఇప్పుడు నిర్వహించట్లేదు. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ కొద్ది సేపటి క్రితం స్పష్టం చేశారు. అలాగే ఏపీలో ఖాళీ అయిన 5 పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు లేవని ఆయన ప్రకించారు. ఆ స్థానాలు వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఏర్పడినవి. విశాఖపట్టణం జిల్లాలోని లివిటిపుట్టలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు ఇటీవల కాల్చి చంపారు. అయితే ఏడాదిలోపు గడువు ఉన్న స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.