ఇటీవల మోలీవుడ్ మూవీ దగ్గర వచ్చి భారీ హిట్ అయ్యిన మూవీ ల్లో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్ తదితర యువ నటులు నటించిన రియల్ లైఫ్ సర్వైవల్ డ్రామా “మంజుమ్మల్ బాయ్స్” (Manjummal Boys) కూడా ఒకటి. దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఈ సాలిడ్ థ్రిల్లర్ తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని అందుకుంది.
ఇలా సౌత్ లో విడుదల అయ్యిన అన్ని భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న ఈ మూవీ ఫైనల్ గా ఓటిటి రిలీజ్ (Manjummel Boys OTT) డేట్ ఫిక్స్ చేసుకున్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి . వీటి ప్రకారం ఈ మూవీ ఈ మే 3 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తోంది . ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ + హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ మూవీ ఆరోజు నుంచి రానున్నట్టుగా టాక్.
మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉన్నది . ఇక ఈ మూవీ కి సుశీన్ శ్యామ్ సంగీతం అందించగా తెలుగులో ఈ మూవీ ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి వారు రిలీజ్ చేశారు.