ముందే రాబోతున్న పేపర్‌బాయ్‌…!

Paper Boy Release On August 31st

సంతోష్‌ శోభన్‌ హీరోగా ప్రియా శ్రీ, తన్య హోప్‌లు హీరోయిన్స్‌గా తెరకెక్కిన చిత్రం ‘పేపర్‌ బాయ్‌’. ఈ చిత్రాన్ని సంపత్‌ నంది నిర్మించిన కారణంగా సినీ వర్గాల్లో ఆసక్తి ఉంది. ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా సంపత్‌ నంది చేసినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు శోభన్‌ తనయుడిగా ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయం అయిన సంతోష్‌ ఈ చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకుంటాను అంటూ నమ్మకంగా చెబుతున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 7వ తేదీన విడుదల చేయాల్సి ఉంది. కాని తాజాగా శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని వాయిదా వేయడం జరిగింది. ఆగస్టు 31న విడుదల కావాల్సిన అల్లుడు రాని కారణంగా పేపర్‌ బాయ్‌ని ఆ తేదీకి విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ సభ్యులు నిర్ణయించుకున్నారు.

paper-boy

‘పేపర్‌ బాయ్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని చాలా రోజులుగా విడుదల కోసం ఎదురు చూస్తుంది. ఇలాంటి సమయంలో శైలజ రెడ్డి అల్లుడు విడుదల వాయిదా పడటంతో ఈ చిత్రానికి లక్‌ కలిసి వచ్చింది. సెప్టెంబర్‌ 7న విడుదల చేస్తే పోటీ ఎక్కువ ఉండేది. కాని ఆగస్టు 31న విడుదల చేయబోతున్న కారణంగా సినిమాకు పెద్దగా పోటీ ఉండే అవకాశం లేదు. సినిమా ఏమాత్రం ఆకట్టుకునే విధంగా ఉన్నా కూడా తప్పకుండా సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతాయి అంటూ సినీ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి పేపర్‌ బాయ్‌కి మంచి విడుదల తేదీ దక్కిందని సినీ విమర్శకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంపత్‌ నందికి ఈ చిత్రం నిర్మాతగా సక్సెస్‌ను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.

paper-boy