అనుష్క శర్మ ‘పరి’ … తెలుగు బులెట్ రివ్యూ

pari movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   అనుష్క శర్మ, పరంబాత్రా ఛటర్జీ, రజత్‌కపూర్‌, రీటాభరీ చక్రవర్తి
నిర్మాతలు :    అనుష్క శర్మ, కర్ణేశ్‌ శర్మ, ప్రేరణా అరోరా, అర్జున్‌ ఎన్‌.కపూర్‌
దర్శకత్వం :   ప్రోసిత్‌ రాయ్‌
మ్యూజిక్ :   అనుపమ్‌ రాయ్‌

అనుష్క శర్మ… తన మొదటి చిత్రం షారుఖ్ ఖాన్ తో ‘రబ్ నే బనాది జోడి’ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి, తన అందంతో, నటనతో కుర్రకారును మంత్ర ముగ్దుల్ని చేసింది ఈ హీరోయిన్… చివరికి ఎంతో మంది అమ్మాయిల రాకుమారుడిగా ఉన్న విరాట్ కోహ్లి కూడా ఆమె అందానికి మంత్ర ముగ్దుడు అయ్యి , ఆమెను ప్రేమించి, తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇంత అందం, అభినయం ఉన్న అనుష్క శర్మ మొదటిసారి ‘పరి’ అనే హర్రర్ మూవీ లో నటిస్తూ, నిర్మిస్తుంది. ఎన్నో అంచనాలు నడుమ ‘పరి’ చిత్రం రిలీజ్ కాబోతుంది. మరి ఆ అంచనాలకు తగట్టు ఈ సినిమా ఉందో, లేదో తెలుసుకోవాలంటే ఒకసారి రివ్యూ లోకి వెళ్ళాల్సిందే.

కథ :

అర్నబ్ (పరంబాత్రా చట్టర్జీ) ఒక రోజు అర్దరాత్రి కారులో వెళుతుంటే అనుకోకుండా ఒక ఆక్సిడెంట్ చేస్తాడు. ఆ ఆక్సిడెంట్ లో రుఖ్సానా (అనుష్క శర్మ) తల్లి అక్కడికి అక్కడే చనిపోతుంది. దాంతో రుఖ్సానా అనాధ అయిపోవడంతో, ఆమెకి తోడుగా, ఆమె మంచి చెడులు చూసుకోవాలనుకుంటాడు. కానీ అప్పటికే అర్నబ్‌కు పియాలీ(రీటాభరీ చక్రవర్తి)తో నిశ్చితార్థం కూడా జరుగుతుంది. ఇంకోవైపు ప్రొఫెసర్‌(రజత్‌ కపూర్‌) రుఖ్సానాను చంపటానికి తీవ్రంగా గాలిస్తుంటాడు. ఇలా జరుగుతూ ఉండగా రుఖ్సానా దెయ్యంలా మరి, అర్నబ్‌ను ఇబ్బంది పెడుతుంటుంది. అసలు రుఖ్సానా ఎందుకు దెయ్యంగా మారింది? మంచి చెడులు చూసుకుంటున్న అర్నబ్ ను ఎందుకు ఇబ్బంది పెడుతుంది? ఇంతకీ ఈ ప్రొఫెసర్ ఎవరు. ఎందుకు ఈ ప్రొఫెసర్‌ రుఖ్సానాని చంపాలనుకుంటున్నాడు? నిశ్చితార్థం అయిన పియాలీని అర్నబ్ ఏమిచేసాడు? ఇలాంటివి తెలుసుకోవాలంటే ధియేటర్ లో సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

ఇది కంప్లీట్ హారర్ చిత్రం అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ‘పరి’ చిత్రంలో అనుష్క శర్మ తన నటనతో ప్రాణం పోసింది. అమాయకపు అమ్మాయిగా, దెయ్యంగా ఇలా ఈ రెండు కోణాల్లో ప్రేక్షకులను బాగా మెప్పించగలిగింది. కొన్ని దెయ్యం సన్నివేశాలలో ఆమె నటన అధ్బుతం అనిపించింది. ఇంకా పరంబాత్రా చాలా బాగా నటించాడు. ఇక భయంకరమైన ప్రొఫెసర్‌ పాత్రలో నటించిన రజత్‌ కపూర్‌ ప్రేక్షకులను భయాందోళనలకు గురిచేస్తాడు. రిటాభరీ కూడా ఆమె పాత్రకు న్యాయం చేసింది.

డైరెక్టర్ ప్రోసిత్‌ రాయ్‌ ది తొలి సినిమానే అయినా కూడా, ‘పరి’ చిత్రాన్ని బాగా తెరకెక్కించాడు. మరి ముఖ్యంగా దెయ్యం సన్నివేశాలు చాలా బాగా తీర్చిదిద్దాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు భయంతో గజగజలాడిపోతారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీసాడు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొన్ని సీన్స్ బోర్ కొట్టిస్తాయి. కానీ ట్విస్ట్ లు బాగా ఉండటం వలన ప్రేక్షకుడికి ఆ ఫీలింగ్ రాకుండా చేసాడు. ఈ భయంకరమైన సన్నివేశాలకు తగ్గట్టుగానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అధ్బుతంగా ఉంది. సంగీత దర్శకుడు ‘అనుపమ్‌ రాయ్‌’ ఈ సినిమాకు చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు. మొత్తానికి ‘పరి’ ఓ మంచి హారర్ చిత్రంగా బాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.

ప్లస్ పాయింట్స్ …

కథ, కథనం

అనుష్క, పరంబత్రా, రజత్‌కపూర్‌ నటన

హర్రర్ సన్నివేశాలు

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌

మైనస్ పాయింట్స్…

సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్

తెలుగు బులెట్ రేటింగ్ … 3\5