మళయాల హీరోయిన్ భావనను కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన నేపథ్యంలో కన్నడ హీరో దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. బెయిల్ మీద తిరిగి వచ్చిన దిలీప్‌ను మళ్లీ మళయాల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (అమ్మ) లోకి తీసుకున్నారు. దిలీప్‌ను అమ్మలోకి తీసుకోవడాన్ని పలువురు కన్నడ సినీ పరిశ్రమ ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక మహిళలను కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన వ్యక్తికి అమ్మలో స్థానం ఇవ్వడం ఏంటి అంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొందరు అయితే దిలీప్‌కు వ్యతిరేకత తెలుపుతూ ప్రత్యేక సంఘాలుగా ఏర్పాడ్డారు. దిలీప్ అమ్మలో కొనసాగడం వ్యతిరేకించిన వారిలో హీరోయిన్ పార్వతి కూడా ఉన్నారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన పార్వతి తనను తొక్కేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం నా చేతిలో ఒకే ఒక సినిమా ఉంది, దీని తర్వాత అవకాశాలు వస్తాయనే నమ్మకం కూడా లేదు. నేను చాలా గడ్డు పరిస్థితులను అనుభవిస్తున్నాను. అవకాశాలు లేక చాలా బాధలు భరిస్తున్నాను, దిలీప్‌ను వ్యతిరేకించినందుకు నన్ను తొక్కేస్తున్నారు, కేవలం నన్నే కాదు ఆ హీరోను వ్యతిరేకించిన వారందరికి ఇలాంటి పరిస్థితే ఏర్పడిరది, బాలీవుడ్‌లో మీ టూ ఉద్యమంలో భాగంగా తమను లైంగికంగా వేధించిన వారికి సినీ ప్రముఖులు అండగా ఉంటున్నారు కానీ మాలీవుడ్‌లో మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు అంటూ పార్వతి అవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నటనతో, అందంతో ఆకట్టుకునే పార్వతికి అప్పుడే అవకాశాలు కరువవడం చాలా బాధాకరం.