తాను సినిమాలు చేయడం లేదు రాజకీయాలు మాత్రమే చేస్తానని, ఇక మీదట నాకు సినిమాలకు ఎలాంటి సంబంధం ఉండదని పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్పినా ఆయన అభిమానులు మాత్రం వినిపించుకోవడం లేదు. ఎప్పుడు ఆయనపై ఏదో ఒకటి వార్త వస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఇలాంటి న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ మధ్యే నాగబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడని క్లారిటీ ఇచ్చాడు. అయితే హీరోగా నటించక పోవచ్చు కాని అతిథి పాత్రలో మాత్రం పవన్ కళ్యాణ్ చేయవచ్చని కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. పవన్ ఇప్పుడు రాజకీయాలు మాత్రమే చేస్తాడు ఆయనకు సినిమాలు చేసేంత సమయం లేదు. పూర్తిగా ప్రజా జీవితానికి అంకితం కావాలని చూస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు. ఈ క్రమంలోనే ఎవరైనా అద్భుతమైన పాత్రలు తీసుకొస్తే అది కథను మలుపు తిప్పే విధంగా ఉంటే పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ చేయొచ్చని చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా రాబోతోందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మూడేళ్ల కింద కన్ఫర్మ్ చేశాడు పవన్ కళ్యాణ్ఎం తన ప్రొడక్షన్లో అన్నయ్యగారి అబ్బాయితో ఒక సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో చెప్పారు పవన్ కళ్యాణ్. తాను నిర్మించబోయే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక చిన్న అతిథి పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న రామ్చరణ్ ఇది పూర్తయిన తరువాత పవన్ కళ్యాణ్ నిర్మాణంలో రాబోయే సినిమాపై దృష్టి పెట్టనున్నాడు.