కత్తి మహేష్ మీద పవన్ ఫ్యాన్స్ దాడి, సమావేశం రద్దు

Pawan-kalyan-Fans-Stops-Kat

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పవన్‌ కల్యాణ్‌ మీద నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటంతో కాస్టింగ్‌ కౌచ్‌ అంశం ఇప్పుడు ప్రాధాన్యతని సంతరించుకుంది. శ్రీ రెడ్డి వ్యాఖ్యల వెనుక తానున్నానంటూ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చెప్పటంతో మెగా ఫ్యామిలీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవటంతో పరిస్థితి మరింత వేడెక్కింది. నిన్న ఉదయం పవన్‌ సహా మెగా ఫ్యామిలీ హీరోలు ఫిలిం ఛాంబర్‌కు రావటంతో అభిమానులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకొని వారికి మద్ధతు తెలిపారు.

అయితే నిన్న చాంబర్ బయట పవన్ అభిమానులు విద్వంసం సృష్టించే అవకాశాలు ఉండటంతో పోలీసులు పవన్ ని అక్కడ నుండి పంపించి వేశారు. అయితే ఫిలిం ఛాంబర్‌ ఈ రోజు 10 గంటలకు అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ (మా), నిర్మాతల మండలితో పాటు సినీ రంగంలోని 24 శాఖలకు సంబంధించిన వారు ఈ సమావేశంలో పాల్గోనాలని భావించి ముందుగా ఈ సమావేశాన్ని ఛాంబర్‌లోనే నిర్వహించాలని అనుకున్నారు అయితే అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించేందుకు సినీ పెద్దలు నిర్ణయించారు. ఆ సమావేశానికి పవన్ కల్యాణ్ కూడా హాజరు కావాలని భావించారు.

‘మా’ అధ్యక్షులు శివాజీ రాజా నిర్మాతలు సురేష్ బాబు అల్లు అరవింద్ కేయస్ రామారావు దానయ్యఘట‍్టమనేని ఆదిశేషగిరిరావు ఠాగూర్ మధు అశోక్ కుమార్ సీ కల్యాణ్ యన్ వి ప్రసాద్ వంశీ పైడిపల్లి నరేష్ పరుచూరి వెంకటేశ్వరరావు రఘుబాబు హరీష్ శంకర్ జెమినీ కిరణ్ తదితరులతో పాటు 24 క్రాఫ్ట్స్ కు చెందిన పలువురు ప్రముఖులంతా హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ కూడా వస్తారన్న ప్రచారం సాగడంతో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకోవడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ గా చేరుకున్న అభిమానులతో అక్కడ పరిస్థితులు అదుపుతప్పేలా ఉండడంతో సమావేశాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది.

అయితే కత్తి మహేష్ అన్నపూర్ణ స్టూడియో వద్దకి రాగానే గమనించిన పవన్ ఫ్యాన్స్ కత్తిని అడ్డుకున్నారు.పవన్ అభిమానుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురు కావడంతో అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు కత్తి మహేష్‌. అయితే వెనుతిరిగిన కాసేపటికి “నేను పవన్ కళ్యాణ్ తో మాట్లాడదాం అని వెళ్లాను. సంఘీభావం వ్యక్తపరచడానికి వెళ్ళాను. తల్లి ఎవరికైనా తల్లే అనే నినాదంతో ముందుకెళ్లండి. పరిశ్రమ కోసం పాటుపడండి. అనవసరపు రాజకీయం చెయ్యకండి. అని చెప్పడానికి వెళ్లాను. ఫ్యాన్స్ నాపై దాడికి ప్రయత్నం చేశారు. థాంక్స్ పవన్ కళ్యాణ్ అంటూ కత్తి ట్వీట్ చేశారు.