రాజకీయాల్లో బుడిబుడి అడుగులు వేస్తున్న జనసేన ఇప్పుడిప్పుడే మీడియా బలాన్ని పోగు చేసుకుంటోంది. ఆ వ్యూహంలో భాగం గానే ఇటీవల జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ న్యూస్ వేవ్ యు ట్యూబ్ ఛానల్ తో కలిసి 99 ఛానల్ ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. యాజమాన్యం మారగానే ఛానల్ భవితవ్యం మారిపోవడం అంత ఈజీ కాదని ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఏ మాత్రం అనుభవం వున్నవారికి అయినా అర్ధం అవుతుంది. అయినా 99 ఛానల్ కి కొత్త ఊపు తెచ్చేందుకు కొత్త యాజమాన్యం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని బాగానే వాడుతోంది.
కొత్త యాజమాన్యం కిందకి వచ్చిన 24 గంటల్లో 99 ఛానల్ కి సంబంధించిన యు ట్యూబ్ ఛానల్ కి 2 లక్షల మంది సబ్ స్క్రైబ్ అయ్యారు.
ఇదంతా ఆ ఛానల్ నాణ్యతలో వచ్చిన మార్పు తో సాధ్యం అనుకుంటే పొరపాటే. ఓ వ్యూహం ప్రకారం పవన్ ఫాన్స్ ని ఇందులో భాగం చేసినట్టు తెలుస్తోంది. తాజాగా జనసేన ఆధ్వర్యంలో పని చేస్తున్న ఐటీ వింగ్ కూడా ఇందులో భాగస్వామి అయ్యింది. 24 గంటల్లో రెండు లక్షల సబ్ స్క్రైబర్స్ అనేది జాతీయ స్థాయి రికార్డు అంటున్నారు. మున్ముందు ఛానల్ trp రేటింగ్స్ కూడా భారీగా పెరిగేలా జనసేన శ్రేణుల్ని సమాయత్తం చేసేందుకు కూడా ఓ వ్యూహం రూపొందిస్తున్నారు. మొత్తానికి మీడియా పరంగా జనసేన 99 ఛానల్ తీసుకున్న వెంటనే పవన్ ఫాన్స్ సబ్ స్క్రిప్షన్స్ రూపంలో మంచి గిఫ్ట్ ఇచ్చారు.