పవన్ కళ్యాణ్ కోసం ‘తలకాయ గోడకేసి కొట్టుకున్న’ అభిమాని..!

Pawan Kalyan fan beat his head on Stone at Vijayanagaram

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నిన్న మొన్నటి వరకు పార్ట్ టైం రాజకీయాలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫుల్ టైం రాజకీయాలు మొదలుపెట్టారు. ఇక ఎన్నికలు ఏడాదే ఉండడంతో ప్రజాపోరాట యాత్ర అంటూ ప్రజల్లో పర్యటిస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ పవన్ జనాల్లోకి వచ్చిన సమయంలో ఆయనకు అండగా నిలవాల్సిన ఆయన అభిమానులు ఆయనకు అండగా నిలవకపోగా కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల గురించి పోరాటానికి జనం ముందుకు వచ్చాడో లేక తన అభిమానులను ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చాడో అర్ధం కానట్టు తయారైంది వ్యవహారం.

శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల రాజకీయ నేతలపై తనదైనశైలిలో విరుచుకుపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనను ముగించుకుని విజయనగరంలోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్‌కు అక్కడి అభిమానుల నుంచి ఇబ్బందులు మొదలైయ్యాయి. బొబ్బిలిలో పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ ముందు నానా రభస జరిగింది. పవన్ కళ్యాణ్ బయటకు రావాలంటూ అక్కడ ఫ్యాన్స్ అలజడిరేపారు. పవన్ కళ్యాణ్ బయటకు రావాలంటూ అరుపులు కేకలతో అక్కడున్న ప్రాంతాన్ని హోరెత్తించారు…. దీంతో పీకే ఒకసారి వారిని పలకరించి వెళ్లాడు. దూరం నుంచి చేతులు ఊపుతూ వెళ్లాడు…. అయితే అంతటితో అభిమానులు వెనక్కు తగ్గలేదు.

పవన్ కళ్యాణ్ మళ్లీ రావాలంటూ పట్టుబట్టారు. ఈ సమయంలో ఒక అభిమాని అయితే గోడకు తన తలను కొట్టుకుని నిరసన తెలిపాడు. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే వరకూ తన తలను గోడకేసి బాదుకుంటానని అతడు ఆ పని చేశాడు. చివరకు పోలీసులు వారించి అతడిని అక్కడ నుంచి పంపించి వేశారు. అయితే ఇటువంటి సంఘటనలు పవన్ కళ్యాణ్ ప్రతిచోటా ఎదురవుతుండటంతో పవన్… తన అభిమానుల పట్ల కొంత అసహనం చెందినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇది మొదటి సారి కాదు. శ్రీకాకుళం పర్యటనలో ఒక గెస్ట్ హౌస్ లో బస చేసినప్పుడు కూడా ఇదే వ్యవహారం.

పవన్ కళ్యాణ్‌‌ను తాము చూడాల్సిందే అంటూ ఫ్యాన్స్ పట్టుబడ్డారు. చివరకు గెస్ట్ హౌస్ కు కరెంటు కట్ చేయడం వరకూ వెళ్లింది వ్యవహారం. అయితే అది తనపై జరిగిన హత్యాయత్నం అంటూ పవన్ కల్యాణ్ కవర్ చేసాడనుకోండి అది వేరే విషయం. ఇలాంటి ఎగబడే ఫ్యాన్స్‌తో పవన్ కు లాభం కన్నా నష్టమే ఎక్కువ. అభిమానం ఉంటే ఉండవచ్చు… సామాన్య ప్రజలు తమ గోడును పవన్ కళ్యాణ్ కి చెబుతున్న సమయంలో పవన్ అభిమానులు వ్యవహరిస్తున్న అత్యుత్సాహం జనసేన నాయకులతో పాటు సామాన్య ప్రజా నికానికి కూడా చికాకు తెప్పిస్తోంది. ఇప్పటికయినా జనసేన వ్యుహకర్తలు మేల్కొని పరిస్థితి సరిదిద్దక పోతే పవన్ గురించి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశాలే మెండుగా ఉన్నాయి.