పవన్‌పై ఏపీలో వ్యతిరేకత…

Pawan kalyan Meets to KCR then Ap State People Angry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం అయ్యింది. ఎన్ని స్థానాలు అనే విషయంపై త్వరలో క్లారిటీ ఇవ్వాలని పవన్‌ భావిస్తున్నాడు. ఈ సమయంలోనే ఏపీలో రోజు రోజుకు పవన్‌కు, జనసేనకు మద్దతు పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వ్యతిరేకత మరియు జగన్‌పై ఉన్న అవినీతి ఆరోపణల కారణంగా పవన్‌కు ఈసారి ఛాన్స్‌ ఇవ్వాలని అక్కడ యువత ఎక్కువగా భావిస్తున్నట్లుగా ఒక సర్వేలో వెళ్లడైంది. ఈ సమయంలో ఏపీ ప్రజలు పెద్దగా ఇష్టపడని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పవన్‌ కవడం వారికి రుచించడం లేదు.

Pawan-kalyan-meets-to-KCR

ఏపీ ప్రజలు పడుతున్న కష్టాలకు కేసీఆర్‌ కారణం అంటూ ఒక వర్గం వారు అక్కడ బాగా ప్రచారం చేశారు. దాంతో ప్రజలు కేసీఆర్‌పై కోపంతోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్‌ను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు అంటూ పవన్‌ కలవడం విమర్శలకు తావిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌ పథకాన్ని పవన్‌ ప్రశంసించిన విషయం తెల్సిందే. అదే సమయంలో కేసీఆర్‌తో పవన్‌ దోస్తీకి కూడా సిద్దంగా ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పవన్‌పై వ్యతిరేకత మొదలవుతుంది. ఈ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుంది అనేది 2019 ఎన్నికల్లో తేలిపోయే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో జనసేన జెండాను ఎగరవేయాలని భావిస్తున్న పవన్‌ కేసీఆర్‌తో దోస్తీ కట్టాలని భావిస్తున్నట్లుగా కొందరు అంచనా వేస్తున్నారు.