పవన్‌ మూవీ.. 95 కోట్లు కాస్త 120 కోట్లు అయ్యింది

Pawan Kalyan New movie 95 Crores Has Been Around 120 Crores

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆలస్యం అవుతూ వస్తుంది. సినిమా ప్రారంభం సమయంలో ఆగస్టులో విడుదల చేస్తామని ప్రకటించారు. కాని ఆగస్టుకు సినిమా షూటింగ్‌ ఇంకా సగానికి అటు ఇటుగానే పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఆలస్యం అయిన రోజు రోజుకు సినిమా బడ్జెట్‌ పెరుగుతూనే ఉంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా చెబుతూ వస్తున్నారు. పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబోపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి నేపథ్యంలో ఏకంగా 95 కోట్లు పెట్టి సినిమా నిర్మించేందుకు నిర్మాత రాధాకృష్ణ ముందుకు వచ్చాడు. అయితే ఆలస్యం అవుతున్న కారణంగా ఈ సినిమా బడ్జెట్‌ 120 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది.

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ చిత్రం కోసం భారీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సెట్టింగ్‌ను వేయడం జరిగింది. ఆ సెట్టింగ్‌ మెయింటెన్స్‌కే భారీగా ఖర్చు అవుతుంది. ఇక నటీనటుల డేట్లు కుదరక పోవడంతో వారి డేట్లు మళ్లీ మళ్లీ మార్చడం, కొత్తగా తీసుకోవడం జరుగుతుంది. ఆ కారణంగా కూడా బడ్జెట్‌ ఎక్కువ అవుతుంది. 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 150 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అవ్వడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు. సినిమా సక్సెస్‌ అయితే 200 కోట్లు సునాయాసంగా పవన్‌కు వసూళ్లు చేసే దమ్ము ఉంది. అందుకే నిర్మాత ఏమాత్రం భయం లేకుండా అంత బడ్జెట్‌ అయినా కూడా కూల్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు:

నేనే రాజు నేనే మంత్రి’ కొత్త తరహా ప్రమోషన్స్‌

రాంప్ వాక్ తో అదరగొట్టిన నాగ చైతన్య సమంత

తెలుగు సినీ పరిశ్రమ పరువు తీశారు : వర్మ