Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షకు కూడా దిగుతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్… ఈ అంశంపై జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అన్నది ప్రజల ఎమోషన్స్ నుంచి వచ్చిన డిమాండ్ కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. హోదా రాజకీయ పార్టీల నుంచి వస్తున్న డిమాండ్ మాత్రమేనని, రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ డిమాండ్ వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ… ఇలా పేరు ఏదైనా రాష్ట్రానికి ఆర్థికసాయం అందడమే ముఖ్యమన్నారు. థర్ట్ ఫ్రండ్, గుంటూరు సభలో చంద్రబాబు కుటుంబంపై చేసిన ఆరోపణలపైనా పవన్ స్పందించారు.
థర్ ఫ్రంట్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నారు పవన్. పరిపాలన పరంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పోలిక వస్తే… చంద్రబాబుకు 2.5 మార్కులు మాత్రమే వేస్తానని, కేసీఆర్ కు మాత్రం 6 మార్కులు వేస్తానని పవన్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలో ఎక్కడెక్కడ అవినీతి జరుగుతోందో చంద్రబాబుకు తెలుసన్నారు. టీడీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు, కొందరు నేతలు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి తనతో చెప్పారని, పవన్ వెల్లడించారు. దీనిపై చంద్రబాబుకు చాలా సార్లు చెప్పానని, అయినా ఆయన పట్టించుకోలేదని పవన్ మండిపడ్డారు. మంత్రి లోకేష్ కు ఉన్న లింకులపై న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీపై ఏపీ ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని, అయితే టీడీపీకి, బీజేపీకి మధ్య జరుగుతున్న గొడవలో తాను జోక్యం చేసుకోదలుచుకోలేదని పవన్ స్పష్టంచేశారు.