Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘కాటమరాయుడు’ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ పవన్‌కు ఫ్లాప్‌లుగా నిలిచాయి. ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ అయినా కూడా ప్రస్తుతం పవన్ చేస్తున్న చిత్రంపై ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కారణం ఆ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌ను సాధించి, రికార్డులను సృష్టించాయి. అంతటి రికార్డు ఉన్న వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం మరోసారి రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అని, కొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అని ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇంతగా అంచనాలున్న ఈ చిత్రానికి టైటిల్ ఏంటి అనే విషయమై గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతుంది.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా జాబ్ చేస్తుంటాడు. ‘దేవుడు చేసిన మనుషులు’, ‘ఇంజనీర్బాబు’.. ఇలా పలు టైటిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో టైటిల్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదే ‘రాజు వచ్చినాడు’. త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్ కాస్త విభిన్నంగా ఉంటాయి. అందుకే ఈసారి కూడా ఇలాంటి టైటిల్‌ను ఆయన ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ‘రాజు వచ్చినాడు’ టైటిల్ ప్రేక్షకులకు క్యాచీగా ఉండటంతో పాటు, పవన్‌కు యాప్ట్‌గా కూడా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి ఈ టైటిల్ ఎంత వరకు నిజమో తెలియాలంటే సెప్టెంబర్ 2 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఆ రోజు పవన్, త్రివిక్రమ్‌ల మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా అను ఎమాన్యూల్ మరియు కీర్తి సురేష్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
మరిన్ని వార్తలు: