Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“ ఆపరేషన్ గరుడ” లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కొత్త నాయకులని బీజేపీ ఓ అస్త్రంగా మలుచుకుంటుందని నటుడు శివాజీ చెప్పిన రోజు చాలా మందికి ఎన్నో సందేహాలు. ఇందులో నిజముందా అనే ప్రశ్నలు తలెత్తాయి.కానీ అందులో నిజం ఉందని ఇప్పుడు పవర్ స్టార్ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరూపించారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా సహా విభజన హామీల డిమాండ్ తో జన్మదినం రోజే దీక్షకు దిగారు. ప్రధాని మోడీ మీద నేరుగా పోరాటానికి దిగిన చంద్రబాబుని సమర్ధించకపోయినా పర్లేదు కానీ అదే రోజు ఆయన్ని టార్గెట్ చేస్తూ పవన్ ట్వీట్స్ చేయడం తో ఇది ఆపరేషన్ గరుడ లో భాగం అనే సందేహాలు బలపడుతున్నాయి.
#1 backstab pic.twitter.com/10SWSolxwf
— Pawan Kalyan (@PawanKalyan) April 19, 2018
తాజాగా బయటపడ్డ శ్రీరెడ్డి ఆడియో టాక్ లో తనని వైసీపీ అప్రోచ్ అయ్యిందన్న విషయం నేరుగా బయటపెట్టినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా అందుకు చంద్రబాబు , లోకేష్ , ఆయన స్నేహితుడు కిలారు రాజేష్ , మీడియా ని టార్గెట్ చేయడాన్ని ఏమనుకోవాలి ?. పవన్ కళ్యాణ్ ని తిట్టిన వాళ్ళ నోట స్వయంగా వైసీపీ పేరు వచ్చినా దాన్ని పట్టించుకోకుండా టీడీపీ ని టార్గెట్ చేయడాన్ని చూస్తుంటే ఆపరేషన్ గరుడ నిజమే అనిపిస్తోంది.
#2 backstab pic.twitter.com/TbfbgWeZIs
— Pawan Kalyan (@PawanKalyan) April 19, 2018
సరే పవన్ చెప్పేది నిజమే అనుకున్నా ప్రత్యేక హోదా ఉద్యమం పతాక స్థాయికి చేరిన ఈ తరుణంలో బీజేపీ గురించి గానీ , ప్రధాని మోడీ గురించి గానీ , కేంద్ర ప్రభుత్వం గురించి గానీ ఒక్క మాట మాట్లాడాడడానికి కూడా ఆయనకు నోరు పెగలడం లేదు పాపం. కనీసం ఒక్క ట్వీట్ అయినా వెయ్యొచ్చు కదా ! . ఈ విషయాలు ఏమీ జనం గమనించలేదు అనుకోవడం , చంద్రబాబుని దీక్ష చేసే రోజే విమర్శించడం చూస్తుంటే పవన్ రాజకీయ అమాయకత్వం బయటపడుతోంది. జనాన్ని ఇలా అమాయకులు అనుకుని ముందుకొచ్చిన చాలా మంది నాయకులు తమ అమాయకత్వాన్ని , అజ్ఞానాన్ని బయటపెట్టుకుని రాజకీయ యవనిక నుంచి నిష్క్రమించారు.
#3 backstab pic.twitter.com/lNJ75awH1R
— Pawan Kalyan (@PawanKalyan) April 19, 2018